2024-07-27 01:09:55
Today Horoscope : ఆ రాశి వారికి ఉద్యోగాలలో పనిభారం! – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి ఉద్యోగాలలో పనిభారం!

Today Horoscope : ఆ రాశి వారికి ఉద్యోగాలలో పనిభారం!

SREE KRUPA (23-02-2022) రాశి ఫలితాలు

మేషం – 23-02-2022

నూతన రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.

వృషభం – 23-02-2022

నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. కొన్ని వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

మిధునం – 23-02-2022

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయ సంభంధిత సభ, సమావేశాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కర్కాటకం – 23-02-2022

స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

సింహం – 23-02-2022

రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది బందు మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో చర్చలు సఫలమౌతాయి. వ్యాపారమున స్వంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకులిస్తాయి.

కన్య – 23-02-2022

చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో సఖ్యత కలుగుతుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

తుల – 23-02-2022

చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

వృశ్చికం – 23-02-2022

నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. భూవివాదాలు పరిష్కారమౌతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది.

ధనస్సు – 23-02-2022

కుటుంబ సభ్యులతో కొద్దిపాటి సమస్యలు ఉంటాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దైవచింతన పెరుగుతుంది. బంధు మిత్రులతో అకారణ వివాదాలుంటాయి. సోదరులతో సఖ్యత లోపిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

మకరం – 23-02-2022

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన, వస్తువులు బహుమతులుగా పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి.

కుంభం – 23-02-2022

సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా సాగుతాయి.

 మీనం – 23-02-2022

చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నూతన రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.comGIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి ఆప్తుల నుంచి శుభవార్తలు

 

For More Updates Follow us on – Sirimalli Page