Today Horoscope : ఆ రాశి వారికి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ( 05-03-2022 )
Bhakthi Latest

Today Horoscope : ఆ రాశి వారికి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ( 05-03-2022 )

Today Horoscope : ఆ రాశి వారికి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ( 05-03-2022 )

SREE KRUPA (05-03-2022) రాశి ఫలితాలు

 

మేషం – 05-03-2022

Today Horoscope : ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికం అవుతుంది. బంధుమిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృషభం – 05-03-2022

స్నేహితుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులు తో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి.

మిధునం – 05-03-2022

చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

కర్కాటకం – 05-03-2022

చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు అధికమవుతాయి. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం – 05-03-2022

వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప చికాకులు తప్పవు.

కన్య – 05-03-2022

జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తినిస్తాయి.

తుల – 05-03-2022

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.

వృశ్చికం – 05-03-2022

ధన పరంగా కొంత ఇబ్బందులు తప్పవు నూతన ఋణప్రయత్నాలు కలిసిరావు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

ధనస్సు – 05-03-2022

ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. రాజకీయ ప్రముఖుల తో చర్చలు సఫలం అవుతాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

మకరం – 05-03-2022

నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు జరుగుతాయి. రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.

కుంభం – 05-03-2022

ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తికావు. మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు.దూరప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

మీనం – 05-03-2022

ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారు.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (05-03-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page