2024-07-27 05:49:22
Today Horoscope : ఆ రాశి వారికి ఆప్తుల నుండి శుభవార్తలు (02-03-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి ఆప్తుల నుండి శుభవార్తలు (02-03-2022)

Today Horoscope : ఆ రాశి వారికి ఆప్తుల నుండి శుభవార్తలు (02-03-2022)

SREE KRUPA (02-03-2022) రాశి ఫలితాలు

 

మేషం – 02-03-2022

Today Horoscope :  చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సంతాన వివాహ విషయమై ఆప్తులతో చర్చలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

వృషభం – 02-03-2022

సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణానికి శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది.

మిధునం – 02-03-2022

చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు. ఆరోగ్య విషయంలో మరింత జగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.

కర్కాటకం – 02-03-2022

ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. కుయంబ సభ్యులతో దైవ క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత మందకోడిగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

సింహం – 02-03-2022

సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఇంటాబయటా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య – 02-03-2022

నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా కాలంగా వేదిస్తున్న సమస్యలు నుంచి బయటపడతారు.దూరపు బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

తుల – 02-03-2022

ఆర్థిక సమస్యలు వలన నూతన ఋణాలు చెయ్యవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం – 02-03-2022

దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగులకు ఊహించని స్థానచలానాలుంటాయి.

ధనస్సు – 02-03-2022

దూరపు బంధువుల ఆగమనంతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీ కారం చూడతారు. వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగస్థులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరం – 02-03-2022

చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.

కుంభం – 02-03-2022

ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉయోగపడతాయి.వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాల సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్య అనుకూలత కలుగుతుంది.

మీనం – 02-03-2022

కుటుంబసభ్యులతో ఆకారణ వివాదాలుంటాయి వ్యాపారాలు కొంత నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)