2024-07-27 09:33:54
Navratri 2022 : ఈసారి దేవీ నవరాత్రుల ప్రత్యేకత ఏమిటి? ఏ రోజు ఏ అలంకారం ఉంటుంది? – Sirimalli.com

Navratri 2022 : ఈసారి దేవీ నవరాత్రుల ప్రత్యేకత ఏమిటి? ఏ రోజు ఏ అలంకారం ఉంటుంది?

Navratri 2022 : ఈసారి దేవీ నవరాత్రుల ప్రత్యేకత ఏమిటి? ఏ రోజు ఏ అలంకారం ఉంటుంది?

 

SREE KRUPA

Navratri 2022 ఈసారి దేవీ నవరాత్రులు ఎప్పుడొచ్చాయి… అమ్మవారు ఏ రోజున ఏ రూపంలో దర్శనమిస్తారంటే…

Navratri 2022 ఈ ఏడాది శారద నవరాత్రులు ఎప్పుడొచ్చాయి… శుభ ముహుర్తం ఎప్పుడు.. నవరాత్రుల ప్రాముఖ్యతలేంటి.. అమ్మవారు ఏయే రోజు ఏయే రూపంలో దర్శనమివ్వనున్నారనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

Navratri 2022 శారద నవరాత్రుల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కోల్ కత్తాలో దుర్గా మాత విగ్రహాలను ఏర్పాటు చేస్తే.. మైసూరులో తొమ్మిది రోజుల పాటు ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనూ దేవీ శరన్నవరాత్రుల వేడుకలు విభిన్నంగా నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తే.. తెలంగాణలో మాత్రం బతుకమ్మ సంబురాలను జరుపుకుంటారు. పదో రోజున విజయ దశమి వేడుకలను నిర్వహిస్తారు. దసరా పండుగ రోజున బెజవాడ దుర్గమ్మ రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. మరోవైపు తిరుమల, విజయవాడలో బ్రహ్మోత్సవాలను సైతం ఘనంగా నిర్వహిస్తారు. ఇవే కాదు శ్రీశైలం మల్లన్న, బాసర, ఆలంపూర్ వంటి పుణ్యక్షేత్రాల్లోనూ నవరాత్రుల వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా.. 2022 సంవత్సరంలో శారద నవరాత్రులు ఎప్పుడొచ్చాయి… శుభ ముహుర్తం ఎప్పుడు.. నవరాత్రుల ప్రాముఖ్యతలేంటి.. అమ్మవారు ఏయే రోజు ఏయే రూపంలో దర్శనమివ్వనున్నారనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…
​అశ్విని మాసంలో..

Navratri 2022 :

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రులు అశ్విని మాసంలోని శుక్ల పక్షంలో ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శారద నవరాత్రులు సెప్టెంబర్ 26వ తేదీ అంటే వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల ఉత్సవాల అనంతరం అక్టోబర్ 5వ తేదీన విజయదశమి(దసరా) వేడుకలతో ముగుస్తాయి. ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో దుర్గామాత మానవాళి సంక్షేమానికి కృషి చేస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ తొమ్మిది రోజుల పాటు కొన్ని శుభ యోగాలు కూడా ఏర్పడనున్నాయి.

​రెండు శుభ యోగాలు..

Navratri 2022 : ఈసారి నవరాత్రుల వేళ సర్వార్ధ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగంతో సెప్టెంబర్ 26న ప్రారంభం కానున్నాయి. ఈ రెండు శుభ యోగాల సమయంలో అమ్మవారికి పూజలు చేస్తే ఎలాంటి కష్టాల నుండైనా విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్మకం. అంతేకాదు మీరు చేసే పనుల్లో ప్రత్యేక ఫలితాలను పొందుతారు. అంతేకాదు మన సంపద కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారి ఇల్లు ఎల్లప్పుడూ సంపద నిండి ఉంటుందని, ఆహారానికి ఎలాంటి కొరత అనేదే ఉండదని చాలా మంది విశ్వాసం.

Navratri 2022 : నవరాత్రుల్లో భాగంగా సెప్టెంబర్ 29వ తేదీన గురువారం నాడు రవి యోగం ఏర్పడనుంది. అదే విధంగా అక్టోబర్ 1, 3వ తేదీన కూడా రవియోగం రానుంది. ఈ యోగం సూర్యునికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. ఈ పవిత్రమైన యోగం సమయంలో అమ్మవారిని పూజించడం వల్ల మన జీవితంలో ఏర్పడిన చీకటి అంతా తొలగిపోయి వెలుగు ప్రకాశిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ సమయంలో అమ్మవారి రూపాలైన కూష్మాండ దేవి, కాత్యాయని, మహాగౌరిలను పూజిస్తే శుభ ఫలితాలొస్తాయని చాలా మంది విశ్వాసం.

​తొమ్మిది రూపాల్లో..

 

Navratri 2022 : నవరాత్రుల వేళ అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. అయితే ఉత్తర భారతంలో వేర్వేరు రూపాలను అమ్మవారిని ఆరాధిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ తొమ్మిది రూపాల్లో దుర్గామాతను పూజిస్తారు. ఉత్తర భారతంలో పాడ్యమి రోజు శైల పుత్రి దేవి, విధియ రోజు బ్రహ్మచారిణి, తదియ రోజు చంద్రఘంట పూజ, చతుర్ధి రోజు కూష్మాండ అవతారంలో, పంచమి రోజున స్కంద మాత, షష్ఠి తిథి నాడు కాత్యాయని దేవిగా, సప్తమి తిథి వేళ కాళరాత్రి అమ్మవారి పూజ, అష్టమి నాడు మహా గౌరి పూజ, దుర్గాష్టమి, నవమి రోజున సిద్ధిదాత్రి పూజ, దుర్గా మహా నవమి పూజను నిర్వహిస్తారు.

26 సెప్టెంబర్ 2022 : తొలిరోజు, సోమవారం రోజున బాల త్రిపుర సుందరీ

27 సెప్టెంబర్ 2022 : రెండో రోజు, మంగళవారం రోజున గాయత్రీ దేవి

28 సెప్టెంబర్ 2022 : మూడో రోజు, బుధవారం రోజున అన్నపూర్ణా దేవి

29 సెప్టెంబర్ 2022 : నాలుగో రోజు, గురువారం రోజున కాత్యాయనీ దేవి

30 సెప్టెంబర్ 2022 : ఐదో రోజు, శుక్రవారం రోజున లలితా దేవి

1 అక్టోబర్ 2022 : ఆరో రోజు, శనివారం శ్రీ మహాలక్ష్మీ దేవి

2 అక్టోబర్ 2022 : ఏడో రోజు, ఆదివారం, మహా సరస్వతీ దేవి

3 అక్టోబర్ 2022 : ఎనిమిది రోజు, సోమవారం మహిషాసుర మర్దిని

4 అక్టోబర్ 2022 : తొమ్మిదో రోజు మంగళవారం రోజున రాజ రాజేశ్వరి దేవి

5 అక్టోబర్ 2022 నవరాత్రులు ముగిసిన వెంటనే విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

 

​నవరాత్రుల శుభ ముహుర్తం..

 

Navratri 2022 : దేవీ నవరాత్రుల వేళ తొలి రోజున అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆరాధించడానికి ముందుగా కలశ స్థాపన చేస్తారు. ఈ కలశ స్థాపనకు సెప్టెంబర్ 26వ తేదీన సోమవారం ఉదయం 6:11 నుండి 7 గంటల వరకు శుభ ముహుర్తం ఉంటుంది. అభిజిత్ ముహుర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:36 గంటల వరకు ఉంటుంది.

​లలిత సహస్రనామాల్లోనూ..

Navratri 2022 : మన దేశంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తా నగరంలో నవరాత్రుల వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. దుర్గా మాతను విశేషంగా పూజిస్తారు. ‘త్రిపుర వ్యాసం’లోని మహాత్మ్య ఖండం శక్తి ఉపాసనా విశిష్టతను పూర్తిగా వివరించారు. త్రిపురకు చెందిన సర్వ మంగళ నామం ‘సప్తశతీ, లలితాత్రిశతి, లలితా సహస్రనామాల్లోనూ మనకు కనిపిస్తుంది. త్రిపుర రహస్యంలో వర్ణితమైన దుర్గా మాతకు జరిపే ఉత్సవాలే దేవీ నవరాత్రులు.

​త్రిమూర్తుల శక్తిగా..

Navratri 2022 : వైదిక సంప్రదాయం ప్రకారం, దేవీ త్రిమూర్తుల శక్తిగా చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతీ దేవిగా కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రు నిర్మూలనకు, మహాలక్ష్మీని ఐశ్వర్య-సౌభాగ్య సంపదలకు, సరస్వతిని విద్య విజ్ఞానానికి అధిష్టాత దేవతలుగా విశ్వసిస్తారు.

​బతుకమ్మ సంబురాలు..

Navratri 2022 : మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ నవరాత్రుల వేళ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజున అటుకుల బతుకమ్మ, మూడో రోజున ముద్ద పప్పు బతుకమ్మ, నాలుగో రోజున నాన బియ్యం బతుకమ్మ, ఐదో రోజున అట్ల బతుకమ్మ, ఆరో రోజున అలిగిన బతుకమ్మ, ఏడో రోజున వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజున వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మతో నవరాత్రి వేడుకలను ముగిస్తారు. ఆ తర్వాత దసరా సంబురాలను ఘనంగా జరుపుకుంటారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page