Virat Kohli : అందుకే కోహ్లీ తప్పుకున్నాడు.. కారణాలు ఇవే..!
Latest Off Beat

Virat Kohli : అందుకే కోహ్లీ తప్పుకున్నాడు.. కారణాలు ఇవే..!

Virat Kohli : ఊహించిందే జరిగింది… కెప్టెన్ గా కోహ్లీ తప్పుకుంటాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకున్నట్లు విరాట్ కోహ్లీ (Virat Kohli) స్వయంగా ప్రకటించాడు. ఇది అభిమానులకి షాక్ అయ్యే వార్తేనని చెప్పాలి. అయితే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి.

ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేకపోవడం :

2017 లో ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలు కోహ్లీ తీసుకున్నాడు.. అంతకు ముందు అండర్ 19 వరల్డ్ కప్ గెలిపించిన రికార్డు.. అప్పుడే టీం లోకి వచ్చి మంచి బ్యాట్స్ మెన్ గా క్రేజ్ రావడంతో కోహ్లీ వైపు బీసీసీఐ కూడా మొగ్గు చూపింది. కెప్టెన్ గా కోహ్లీ కూడా సక్సెస్ అయ్యాడు. కానీ అతని సారధ్యంలో టీంఇండియా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేదు. అతనికది ఓ మరకలాగా ఉండిపోయింది.

కెప్టెన్సీ తర్వాత ఆటగాడిగా రాణించకపోవడం :

కెప్టెన్సీ బాధ్యతలు తన భారం కాదన్న కోహ్లీ.. మొదట్లో ఆటు కెప్టెన్ గా ఇటు ఆటగాడిగా అలరించాడు. కానీ గత రెండేళ్లుగా అతని ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు.. మొత్తం మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీ నిరాశపరుస్తున్నాడు. గత 53 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. దీనితో కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకోవాలని క్రికెట్ అభిమానుల నుంచి ఒత్తిడి మొదలైంది.

ఐపీఎల్‌ లో ఒక్క కప్ గెలవకపోవడం :

దీనికితోడు ఇండియన్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ… ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబయి ఇండియన్స్ ఏకంగా అయిదుసార్లు టైటిల్‌ గెలిచింది. కానీ కోహ్లీ కెప్టెన్సీలో బెంగుళూరు జట్టు ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈ క్రమంలో రోహిత్ కి కెప్తెన్సీ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ మొదలైంది. ఇది కూడా కోహ్లీ పైన ఒత్తిడి పెంచింది.

ఓటమికి బాధ్యత వహించడం కంటే :

దాదాపుగా ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి ఆటగాళ్లు రాజీనామా చేస్తారు.. క్రికెట్ లో అది సహజమే.. ఇప్పుడు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పకుండా… త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో జట్టు టైటిల్‌ గెలవకపోతే అప్పుడు కోహ్లీ కెప్టెన్ గా తప్పుకోవాలన్న డిమాండ్ మరింతగా పెరుగుతుంది. అది మరింత అవమానకరంగా కూడా ఉంటుంది. ఒకవేళ జట్టు గెలిస్తే సగర్వంగా తప్పుకున్నట్టు కూడా అవుతుంది.

Also Read :