Politics

ఎవరీ గురుమూర్తి.. 10 లక్షలు కూడా లేవన్న వ్యక్తికి సీఎం జగన్ టికెట్..!

నేడు వెలువడిన తిరుపతి ఉపఎన్నిక ఫలితాల్లో వైసీపీ భారీ విజయాన్ని సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి మద్దిల గురుమూర్తి రెండు లక్షలకి పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఎవరీ గురుమూర్తి అనే చర్చ అందరిలో నెలకొంది.

గురుమూర్తి స్వస్థలం చిత్తూరు జిల్లాలోని శ్రీకాహళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఏర్పేడు మండలం మున్నసముద్రం గ్రామం.. ఆయన తండ్రి మద్దిల మునికృష్ణయ్య..

1985 జూలై 22న జన్మించారు గురుమూర్తి.. మధ్య తరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన.. స్విమ్స్ లో ఫిజియోథెరపీని అభ్యసించారు. గురుమూర్తికి  భార్య(నవ్య కిరణ్),  కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Tirupati Lok Sabha By-Polls: YSRCP Candidate Dr Gurumurthy Files Nomination

మొదటినుంచి వైఎస్సార్ కుటుంబానికి పెద్ద అభిమాని కావడంతో ఆ అభిమానం ఫిజియోథెరపిస్ట్ కెరీర్‌నే వదులుకొని ఆ కుటుంబానికి, వైఎస్సార్ పార్టీకి వెంట ఉండేలా చేసింది. సామాన్య కార్యకర్తగా పార్టీలోకి అడుగుపెట్టిన గురుమూర్తికి సౌమ్యుడిగా పార్టీలో మంచి పేరుంది. పార్టీలో కూడా చాలా చురుగ్గా ఉంటూ వచ్చేవారు.

Also Read : 

గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు, షర్మిల పాదయాత్ర చేసినప్పుడు ఆమె వెంటే ఉన్నారు. ఇక జగన్ పాదయాత్ర చేసినప్పుడు.. మొదలు నుంచి చివరి వరకు కూడా ఆయన వెంటే వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేశారు. అప్పటినుంచి జగన్ కి విధేయుడిగా ఉన్న గురుమూర్తికి తిరుపతి ఎంపీ టికెట్ వచ్చేలా చేసింది.

ఈ ఎన్నికల్లో ఆయన.. కేంద్ర మాజీ మంత్రులు మరియు సీనియర్లైన పనబాక లక్ష్మి, చింతామోహన్ తో పాటు రత్నప్రభ లాంటి మాజీ ఐఏఎస్ లను ఎదురుకొని భారీ మెజారిటీతో విజయం సాధించారు.

Jagan names his physio as YSRC nominee for by-poll to Tirupati Lok Sabha seat | Hindustan Times

ఓ సందర్భంలో తిరుపతి ఉప ఎన్నికకు రెడీ కావాలని జగన్.. గుర్తుముర్తికి చెప్పగా.. ‘‘అన్నా, నా వద్ద రూ. 10 లక్షలు కూడా లేవు’’ అని గురుమూర్తి చెప్పినట్లు సమాచారం. ‘‘నువ్వు ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు.. అంతా పార్టీ చూసుకుంటుంది’’ అని సీఎం జగన్ భరోసా ఇచ్చారని తెలుస్తోంది.

పార్టీకి విధేయులుగా ఉన్నవారికి కొంచం ఆలస్యమైనా మంచి పదవులు దక్కుతాయని.. అందుకు ఉదాహరణ గురుమూర్తినేని అంటున్నారు వైసీపీ నేతలు.