Bigg Boss Lobo : లోబో ఎవరు? చిన్నప్పుడే దొంగతనం.. అట్నుంచి గోవా…!
Bigg Boss 5 Telugu Latest

Bigg Boss Lobo : లోబో ఎవరు? చిన్నప్పుడే దొంగతనం.. అట్నుంచి గోవా…!

Bigg Boss Lobo :చిత్రవిచిత్రంగా కనిపిస్తూ భలే గమ్మతైన వేషధారణలో కనిపిస్తుంటాడు లోబో… ఒక్కసారి లోబో(Bigg Boss Lobo )ని చూస్తే ఎవ్వరు మరిచిపోరు కూడా.. అప్పట్లో యాంకర్ గా చేసి ఫేమస్ అయిన లోబో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 లోకి అడుగుపెట్టి మరోసారి ఫేమస్ అయ్యాడు. హౌస్‌లోకి ఆరో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన లోబో గురించి నెటిజన్లు సెర్చింగ్ మొదలుపెట్టారు.

లోబో పక్కా హైదరాబాదు.. జూన్ 17న జన్మించాడు. అతని అసలు పేరు మహమ్మద్‌ ఖయ్యూం. ఇప్పుడు అతని వయసు 39 సంవత్సరాలు, పెద్దగా చదువుకోలేదు. ఎనమిదో తరగతి వరకు చదువుకున్న లోబో.. తొమ్మిదో తరగతి చదువుకుంటున్న టైంలో దొంగతనం చేసి దొరికిపోవడంతో అతనికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించేశారు. దీనితో అతని చదువు మధ్యలోనే ఆగిపోయింది.

తన 19వ ఏటా తన ఫేవరేట్ హీరోయిన్ కాజోల్ ని చూసేందుకు ఇంట్లోనుంచి కొంత డబ్బు తీసుకోని ముంబైకి వెళ్ళాడు. కాజోల్ చూసింది లేదు కదా తెచ్చుకున్న దబ్బులు కూడా అయిపోవడంతో అక్కడే ఎదో పనిచేసి అక్కడినుంచి గోవాకి వెళ్ళాడు. అక్కడ టాటూలు వేయడం నేర్చుకున్నాడు.

ఇక అక్కడినుంచి తిరిగి హైదరాబాదుకి వచ్చి ఇక్కడ టాటూ బిజినెస్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఓ రష్యన్‌ యువతికి టాటూ వేశాడు. అది బాగా నచ్చిన ఆ రష్యన్ యువతి అతనికి ముద్దుగా లోబో అని పేరు పెట్టింది. అది లోబోకి కూడా నచ్చడంతో తన పేరును ఆలాగే మార్చుకున్నాడు.

Also Read :