Weekly Horoscope Telugu : ఆ రాశివారికి అవసరానికి ధన సహాయం! (12-06-2022 నుంచి 18-06-2022)
Bhakthi Latest

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి అవసరానికి ధన సహాయం! (12-06-2022 నుంచి 18-06-2022)

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి అవసరానికి ధన సహాయం! (12-06-2022 నుంచి 18-06-2022)

 

SREE KRUPA

వార ఫలాలు – మేషం

Weekly Horoscope Telugu : వార రాశిఫలాలు (12-06-2022 to 18-06-2022) వారం మొదట్లో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తుల విషయంలో సోదరులతో ఒప్పందాలు కుదురుతాయి. గృహ నిర్మాణయత్నాలు పుంజుకుంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో మరింత అనుకూలంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో సోదరులతో విభేదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మేధో దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – వృషభం

వార రాశిఫలాలు (12-06-2022 to 18-06-2022) చాలకాలంగా వేదిస్తున్న వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రులు ఊహించని విధంగా సహకరిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇంతకాలంగా ఉన్న సమస్యలు తొలగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.ప్రయాణాలు వాయిదా పడుతాయి శ్రీ కృష్ణాష్టకం పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మిథునం

వార రాశిఫలాలు (12-06-2022 to 18-06-2022) సన్నిహితుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. సంఘంలో మరింత గౌరవ మర్యాదలు పొందుతారు. ఆస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. నూతన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట లభిస్తుంది. కుటుంబసభ్యులతో సఖ్యత నెలకొంటుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలలో భాగస్వాముల సహాయం అందుతుంది. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి.చిన్నతరహా పరిశ్రమల వారికి నూతన పెట్టుబడులు అందుతాయి.వారం చివరిలో అనుకోని ఖర్చులు. బంధువులతో తగాదాలు ఉంటాయి. లక్ష్మి నృసింహస్తోత్రాలు పఠించండి వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కర్కాటకం

వార రాశిఫలాలు (12-06-2022 to 18-06-2022) కుటుంబ సభ్యులతో కీలక విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలను మిత్రులతో పంచుకుంటారు.బందు మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ విషయంలో చిక్కులు, సమస్యలు తొలగుతాయి. ప్రముఖులు పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి కొన్ని రంగాల వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో విభేదాలు కలుగుతాయి. మానసిక అశాంతి కలుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – సింహం

వార రాశిఫలాలు (12-06-2022 to 18-06-2022) ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి.సంతాన వివాహయత్నాలు సానుకూలమవుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లబిస్తుంది. కొన్ని రంగాల వారికి కొత్త యత్నాలు సఫలం అవుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కన్య

వార రాశిఫలాలు (12-06-2022 to 18-06-2022) శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు సమాజంలో ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహపరుస్తుంది. దీర్ఘకాలిక ఋణ సమస్యలు నుంచి విముక్తి లభిస్తుంది. గృహ నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు. చేపట్టిన వ్యవహారాలు∙ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయంలో కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారాలు విస్తరణ కార్యక్రమాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. చిన్నతరహా పరిశ్రమల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులు ఉంటాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. దుర్గాదేవి స్తోత్రాలు పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – తుల

వార రాశిఫలాలు (12-06-2022 to 18-06-2022) ఆప్తుల నుండి అందిన సమాచారం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి అవుతాయి. ఆత్మీయులతో విభేదాలు నెలకొంటాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. వారం మధ్యలో శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – వృశ్చికం

వార రాశిఫలాలు (12-06-2022 to 18-06-2022) చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు సైతం నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు కొంత ఉత్సాహనిస్తాయి.మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలుపరుస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని రంగాల వారి కృషి ఫలిస్తుంది. వారం చివరిలో వృథా ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. హయగ్రీవస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – ధనస్సు

వార రాశిఫలాలు (12-06-2022 to 18-06-2022) అనుకున్న పనులు స్వయంకృషితో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. అవసరాలకు తగినంతగా సొమ్ము సమకూరుతుంది. కుటుంబసభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఊరట లభిస్తుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగవిధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు కలుగుతాయి. గణేశాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మకరం

వార రాశిఫలాలు (12-06-2022 to 18-06-2022) సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు వృత్తి ఉద్యోగాలలో ఊహించని అవకాశములు లభిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. కుటుంబసభ్యులతో తగాదాలు ఉంటాయి. శ్రీ సూక్తం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కుంభం

వార రాశిఫలాలు (12-06-2022 to 18-06-2022) శత్రు సమస్యలు నుండి తెలివిగా బయట పడతారు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగి ఊరట లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. దైవ సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. గృహమున కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందుతారు. కొన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో బంధువులతో మాటపట్టింపులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మీనం

వార రాశిఫలాలు (12-06-2022 to 18-06-2022) అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. సన్నిహితుల సూచనలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొన్ని పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్థులకు పనిభారం తగ్గుతుంది. చిన్న తరహా పరిశ్రమల వారికి ముఖ్య సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Monthly Horoscope for June 2022 : ఆ రాశివారికి అన్నివైపుల నుంచీ ఆదాయమే!

 

For More Updates Follow us on – Sirimalli Page