Weekly Horoscope :ఈ వారం ఈ రాశులవారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు..(10-12-2023 to 16-12-2023)
Weekly Horoscope : SREE KRUPA (03-12-2023 to 09-12-2023)
మేష రాశిఫలాలు (10-12-2023 to 16-12-2023)
చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు. భూవివాదాల నుంచి తెలివిగా బయటపడతారు.ఇంటబయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అధికారుల నుండి అందిన కీలక సమాచారం నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు.
ఉద్యోగులకు మరింత అనుకూలమైన కాలం అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు
వృషభ రాశిఫలాలు (10-12-2023 to 16-12-2023)
నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో సోదరులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. దత్త పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మిథున రాశిఫలాలు (10-12-2023 to 16-12-2023)
ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడతారు. సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపార విషయమై ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. భూవివాదాలు సమసిపోతాయి. ఆలయ దర్శనాలు తీసుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరతాయి. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన కాలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కర్కాటకం రాశిఫలాలు (10-12-2023 to 16-12-2023)
ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. గృహమున శుభ కార్యాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో స్వల్ప ఆలోచనలు కలసిరావు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి.
బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకోడిగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి కొంత నిరాశ తప్పదు. వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభసూచన లున్నవి గణేశాష్టకం పారాయణం చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.
సింహ రాశిఫలాలు (10-12-2023 to 16-12-2023)
చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. మిత్రుల నుండి ధనలాభ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి కలుగుతుంది.
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత వరకూ తగ్గుతాయి. చిన్నతరహా పరిశ్రమల పెట్టుబడి యత్నాలు సఫలామౌతాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సూచనలు ఉన్నవి. కనకధారా స్తోత్రం పారాయణ చేయుటం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కన్య రాశిఫలాలు (10-12-2023 to 16-12-2023)
చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కీలక సమయంలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగటం మంచిది. సమాజంలో అందరిలోనూ గుర్తింపు పొందుతారు. దాయాదుల తో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
Also Read: Gold Rate Today : హైదరాబాద్, విజయవాడలో ఈరోజు (09-12-2023) బంగారం, వెండి ధరలు
తుల రాశిఫలాలు (10-12-2023 to 16-12-2023)
నూతన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. పాత మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో పని చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నవగ్రహ కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
వృశ్చిక రాశిఫలాలు (10-12-2023 to 16-12-2023)
దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. స్థిరస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సంతానానికి విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు రాఘవన్ చేస్తారు. వారం మధ్యలో ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన పదోన్నతులు పొందుతారు. అన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూత రుణాలు చేస్తారు. తెలుపు, ఎరుపు రంగులు మంచివి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
ధనస్సు రాశిఫలాలు (10-12-2023 to 16-12-2023)
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు చిరకాల కోరిక నెరవేరి ఆశించిన అవకాశాలు పొందుతారు.
గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగుల పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. హయాగ్రీవ స్వామి స్తోత్రం పారాయణ చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మకర రాశిఫలాలు (10-12-2023 to 16-12-2023)
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా అవుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.
నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబం వాతావరణం చికాకుగా ఉంటుంది. రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను ఫలితాలు.
కుంభం రాశిఫలాలు (10-12-2023 to 16-12-2023)
చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఒక వ్యవహారంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఉద్యోగాలలో ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. మధురాష్టకం పారాయణం చేయటం వలన శుభఫలితాలు పొందుతారు.
మీన రాశిఫలాలు (10-12-2023 to 16-12-2023)
నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి.
ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
![Today Horoscope](https://www.sirimalli.com/wp-content/uploads/2023/10/sree-lrupa-panthulu-garu-370x260-1.jpg)
Also Read:
- Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును!
- Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (10-12-2023)
- Today Horoscope: ఆ రాశి వారికి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి..(10-12-2023)
- For More Updates Follow us on – Sirimalli Page