2024-07-27 09:22:43
Weekly Horoscope :ఈ వారం ఈ రాశులవారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.(03-12-2023 to 09-12-2023) – Sirimalli.com

Weekly Horoscope :ఈ వారం ఈ రాశులవారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.(03-12-2023 to 09-12-2023)

Weekly Horoscope :ఈ వారం ఈ రాశులవారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.(03-12-2023 to 09-12-2023)

Weekly Horoscope : SREE KRUPA (03-12-2023 to 09-12-2023)

 

మేష రాశిఫలాలు :

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు లభిస్తాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

వారం చివరిలో ఊహించని ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యసమస్యలు కొంత బాధిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

 వృషభ రాశిఫలాలు :

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శత్రువులను సైతం మీకు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతారు. అవసరానికి ఆదాయం సమకూరుతుంది. కొన్ని వ్యవహారాలలో బందు మిత్రులతో చర్చలు చేస్తారు సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. చిన్నతరహా పరిశ్రమల వారు నష్టాల నుండి బయటపడతారు.

వారం ప్రారంభంలో కుటుంబ సభ్యుల మాటలు బాధిస్తాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. అధికారుల నుండి అందిన ఒక సమాచారం నిరుద్యోగులకు మరింత ఊరటనిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

 మిథున రాశిఫలాలు :

నిరుద్యోగుల అంచనాలు నిజం అవుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వారం ప్రారంభంలో వివాదాలు ఉన్నపటికీ క్రమంగా సర్దుబాటు చేసుకుంటారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగమున ఉన్నత అధికారుల సహాయం అందుతుంది. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

వారం ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. సోదరులతో స్థిరస్తి వివాదాల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. గణపతి స్తోత్రాలు పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశిఫలాలు :

బంధు మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. చాలకాలంగా వేదిస్తున్న కొన్ని సమస్యలు నేర్పుతో పరిష్కరించుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు అమలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వారం మధ్యలో అనుకోని ఖర్చులుంటాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. దుర్గాదేవి స్తోత్రాలు పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

సింహ రాశిఫలాలు :

తెలివిగా వ్యవహరించి కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. కొన్ని వ్యవహారాలలో నూతనోత్సాహంతో ముందడుగు సాగి అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో కీలక సమాచారం అందుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలలో భాగస్వాములతో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఎదురుచూస్తున్న అవకాశాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. అన్నిరంగాల వారికి అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మేధో దక్షిణామూర్తి స్తోత్రాలు పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కన్య రాశిఫలాలు :

ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం పొందుతారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన లాభాలు అందుతాయి.

వారం ప్రారంభంలో స్థిరస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. లక్ష్మి నరసింహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

      Also Read: Gold Rate Today : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈరోజు (01-12-2023) బంగారం, వెండి ధరలు

తుల రాశిఫలాలు:

అన్ని రంగాల వారికీ పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు పెరుగుతాయి. చిన్నపాటి సమస్యలు ఉంటాయి. క్రమక్రమంగా పరిస్థితులు సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొన్ని వివాదాలు పరిష్కారమౌతాయి. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అవసరానికి అదనపు ఆదాయం సమాకూరుతుంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృశ్చికం రాశిఫలాలు:

స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సంతాన వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల సహాయం అందుతుంది.

అన్ని రంగాల వారికి వారం మధ్యలో కొన్ని వివాదాలు నెలకొంటాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

 ధనస్సు రాశిఫలాలు :

వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత గందరగోళంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఉద్యోగమున ఇతరుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. గృహ నిర్మాణయత్నాలు మధ్యలో నిలిపివేస్తారు. వ్యాపారాలలో లాభాలు సామాన్యంగా ఉంటాయి.

ఇంటా బయట అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చిన్నతరహా పరిశ్రమల వారికి కొంత ఊరట లభిస్తుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. చిన్ననాటి మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గణపతి స్తోత్రాలు పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

 మకరం రాశిఫలాలు :

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్థులకు అధికారులతో చర్చలు సఫలమౌతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయాలు ఉత్సాహనిస్తాయి. చిన్నతరహా పరిశ్రమల వారికి నూతన లాభాలు అందుతాయి.

వారం చివరిలో స్వల్ప ఆరోగ్య సమస్యలు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. శ్రీరామరక్షా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభం రాశిఫలాలు :

దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. సన్నిహితుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. బంధు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఇంటా బయట అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు.

వారం మధ్యలో ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప ధన వ్యయ. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు అన్ని విధాలా అనుకూల సమయం. మధురాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

 మీనం రాశిఫలాలు :

చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. సోదరులు, మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. నూతన వ్యక్తులు పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగావకశాలు పొందుతారు. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది.

వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు కొంత బాధిస్తాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ పడతారు. వ్యాపారాలలో అంచనాలు ఫలించి లాభాలు అందుకుంటారు. ఆదిత్య హృదయస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Today Horoscope
SREE KRUPA #Weekly Horoscope

Also Read: