Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (15-08-2021 నుంచి 021-08-2021 వరకు)

Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు 15-08-2021 నుంచి 21-08-2021 వరకు) కింది విధంగా ఉన్నాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు వారఫలాలు (Weekly Horoscope) అన్నీ వరుస క్రమంలో ఇవ్వడం జరిగింది.

SREE KRUPA (Weekly Horoscope)

మేషం (Aries) :

చేపట్టిన పనులు చిన్న ప్రయత్నంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా అవసరాలకు ధనం లభిస్తుంది ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక సమస్యలు నుండి ఊరట లభిస్తుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి చిన్నతరహా పరిశ్రమలకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో ఆర్థికంగా ఇబ్బందులుంటాయి. కుటుంబ సభ్యులతో కలుగుతాయి . ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృషభం (Taurus) :

ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు ఆచరణలో పెడతారు ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. వృథాఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి వ్యాపారమున ఇంతకాలం పడిన శ్రమ తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలుంటాయి కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అన్నిరంగాల వారికీ ఆశించిన ఫలితాలుంటాయి. వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు. అధికమౌతాయి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. రామరక్షా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మిధునం (Gemini) :

గృహమునకు మీరు తీసుకున్న నిర్ణయాలు కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తాయి చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. సంతానం విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు అవరోధాలు అధిగమించి లాభాల అందుకుంటారు ఉద్యోగస్థులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలను అందుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వారం ప్రారంభంలో బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను

కర్కాటకం (Cancer) :

నిరుద్యోగులతో నూతన అవకాశాలు లభిస్తాయి కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి గృహ వాహన యోగం ఉన్నది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. అన్ని రంగాలవారికి క్రమక్రమంగా లాభాల పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగంలో పనిఒత్తిడి అధికమవుతుంది. మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహం (Leo) :

కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. సంతాన వివాహ విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమును కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారమున లాభాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున పని ఒత్తిడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. రాజకీయ రంగాల వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచడం మంచిది హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.

కన్య (Virgo) :

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి సోదరులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ విషయమై కొంత మానసిక సమస్యలు తప్పవు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా పడతాయి. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం కొంత నిరాశ కలిగిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది

తుల (Libra) :

ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది బంధుమిత్రులుతో సఖ్యతగా వ్య్వవహరిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులకు అరుదైన అవకాశాలు అందుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు ధార్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు వారం చివర్లో చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది ఆదిత్య హృదయం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చికం (Scorpio) :

నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కుటుంబ సంభందిత వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగస్తులు మరింత ఉత్సాహంగా పని చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వారం ప్రారంభంలో బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు (Sagitarus) :

ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాదిస్తారు చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి దీర్ఘకాలిక ఒత్తిడి నుండి కొంత వరకు బయట పడతారు వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు ఉద్యోగమున శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది చిన్న తరహా పరిశ్రమల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి వారం చివరిలో దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులు మందగిస్తాయి శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.

మకరం (Capricorn) :

అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు సోదరులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. అన్ని రంగాల వారికి మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అధికారులు అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వారం చివరలో ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. నవగ్రహ కవచం పారాయణం చేయడం

కుంభం (Aquarius) :

వారం ప్రారంభంలో కొన్ని సంఘటనలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి వివాదాలు కి సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది ఉద్యోగమున అధికారుల సహాయంతో వివాదాలనుండి బయటపడగలరు చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం ప్రారంభంలో మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ధన పరంగా చికాకులు తప్పవు లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.

మీనం (Pisces) :

ధన పరంగా అవరోధాలు అధిగమిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు సోదరుల నుండి ధన సహాయం అందుతుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభాలు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు సరైన అవకాశాలు లభిస్తాయి. కొన్ని రంగాలవారికి ఒత్తిడి నుండి బయట పడతారు. వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. బంధు వర్గం వారితో విభేదాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

Weekly Horoscope

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి:

Also Read : Today Horoscope : 15-08-2021 ఆదివారం… నేటి రాశిఫలాలు..

Also Read : Today Panchangam : 15-08-2021 ఆదివారం… నేటి పంచాంగం…

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..
తాజా సమాచారం కోసం మాసిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి