Horoscope vruschika raasi scorpio : 2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వృచ్చికరాశి (Horoscope vruschika raasi scorpio) ఫలాలు
విశాఖ 4 వ పాదము లేదా అనురాధ 1,2,3,4 పాదములు లేదా జ్యేష్ఠ 1,2,3,4 పాదములులో జన్మించినవారు వృచ్చిక రాశికి చెందును.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఆదాయం 08, వ్యయం – 14, రాజ పూజ్యం – 04, అవమానం – 05
పూర్వ పద్దతి లో వృచ్చిక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య “5”. ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి సమాజం లో అపవాదులు, అపఖ్యాతి పొందుట సూచించుచున్నది.
వృచ్చికరాశి(Horoscope vruschika raasi scorpio ) వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన ప్రధమ అర్ధ భాగం అనగా 19 నవంబర్ 2021 వరకు తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏర్పరచును. చేపట్టిన కార్యములలో అనేక ఆటంకాలు, ఊహించని నష్టములు ఎదుర్కొందురు. ఉద్యోగ జీవనంలో నిలకడ లోపించును. ఆర్ధిక అంశాలలో ఇతరులకు రుణాలు ఇచ్చుట, ఇతరుల రుణాలకు హామీలు ఉండుట చేయకూడదు. 20 నవంబర్ 2021 నుండి గురు గ్రహం అనుకూల ఫలితాలు ప్రసాదించును. విద్యార్ధులకు విదేశీ విద్యలో ఆశించిన ఫలితాలు లభించును. కుటుంబానికి భూ లేదా గృహ వసతిని ఏర్పరచుకోగలుగుతారు.
వృచ్చిక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని గ్రహం వలన పూర్వపు శార్వరి నామ సంవత్సరం వలెనే సామాన్య యోగ వంతమైన ఫలితాలు ఏర్పడును. వృచ్చిక రాశి వారికి శనైశ్చరుడు లాభ వ్యయాలను సమానంగా ఏర్పరచును. శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా తీవ్ర వ్యతిరేక ఫలితాలు కాని, తీవ్ర అనుకూల ఫలితాలు కాని ఏర్పడవు. వృచ్చిక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.
వృచ్చిక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన చక్కటి ఆర్ధిక లాభములు, వ్యాపార సంబంధ విజయాలు , ఆర్ధిక లావాదేవీలలో కోర్టు కేసులు అనుకూలంగా తీర్పులు లభించుట వంటి అనుకూల ఫలితాలు ఏర్పడును.
వృచ్చిక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కష్టములు ఎదురగును. ముఖ్యంగా వైవాహిక జీవనంలో ఇబ్బందులు , నిత్య తగాదాలు ఎదురగును. అవివాహితుల వివాహ సంబంధ ప్రయత్నాలు కూడా కష్టం మీద ఫలించును. వైవాహిక జీవనంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృచ్చిక రాశి వారు తరచుగా కేతు గ్రహ శాంతులు జరిపించుకోనుట మంచిది.
ఏప్రిల్ 2021 వృచ్చిక రాశి ఫలాలు:
ఈ మాసం సంతోషకరమైన ఫలితాలను ఏర్పరచును. విహార యాత్రలకు ప్రణాళికలు రచించడానికి ఈ మాసం అనుకూలమైనది. ఈ మాసంలో ఆశించిన ధనం లభించును. శత్రు విజయం లభిస్తుంది ద్వితీయ తృతీయ వారాలు కార్య విజయాలు కలుగచేయును. అయితే సంసార సంబంధమైన సంతోషాలు లోపించును. మాట కలయికలో తరచుగా ఇబ్బందులు ఎదురగును. వ్యాపార జీవనంలో దీర్ఘకాలికంగా పరిష్కారం అవ్వని సమస్యలు పరిష్కారం పొందును. ప్రభుత్వ పెద్దలతో అనుమతులకు సంబంధించిన వ్యవహారములు లాభించును. ఈ మాసంలో 6, 8, 11, 21, 26 తేదీలు వ్యాపార సంబంధ కార్యానుకులత కలిగించును.
మే 2021 వృచ్చిక రాశి ఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. తృతీయ వారం ప్రారంభం వరకు ప్రతికూలతలు అధికంగా ఉండును. ఓర్పుతో వ్యవహరించాలి. ధనాదాయం సామాన్యం. సుఖ వ్యాధుల వలన బాధ. ఆలోచనలు అధికం అగుట వలన సతమతమవుతారు. తప్పిదాలను ఒప్పుకొని దైవాన్ని క్షమాపణ కోరుట వలన సంకల్పములు నెరవేరును. బంధు వర్గం వారితో జాగ్రత్త అవసరం. మొత్తం మీద ఈ మాసం అంత ఉత్సాహపూరిత కాలం కాదు.ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం.
జూన్ 2021 వృచ్చిక రాశి ఫలాలు:
ఈ మాసం కూడా మిశ్రమ ఫలితాలను కలిగించును. ఉద్యోగ జీవన పరమైన భయం వెంటాడును. అనారోగ్య సమస్యలు కొనసాగుట బాధించును. మానసిక తొందరపాటుతనం, పై అధికారుల వలన ఒత్తిడి వంటి ఇబ్బందులు చికాకు పరచును. కానీ ప్రయత్నాలు కొనసాగించండి. అవసరాలు వాయిదా వేసుకొనుట మంచిది. కుటుంబ ఖర్చులు అదుపు లోనే ఉండును.నాల్గవ వారంలో సంతాన సంబంధ ప్రయత్నాలు ఫలించును. ఆత్మీయులతో కలయికలు నూతన ఉత్సాహాన్ని కలుగచేస్తాయి. 14, 15 తేదీలలో ప్రయానములందు జాగ్రత్త వహించవలెను.
జూలై 2021 వృచ్చిక రాశి ఫలాలు:
ఈ మాసంలో అనుకూలంగా ఉండును. ఆశించిన విధంగా చక్కటి ధనాదాయం లభిస్తుంది. తలపెట్టిన కార్యములందు విజయాలు చేకురును. ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థాయి వ్యక్తుల దర్శన భాగ్యము పొందగలుగుతారు. ఉద్యోగ జీవనంలో మీ శ్రమకు తగిన గుర్తింపు, గౌరవ సత్కారములు పొందగలుగుతారు. వంశ పెద్దల ఆశీస్శులు లభిస్తాయి. కొద్దిపాటి విఘ్నములు ఉన్నా నూతన పదవులు పొందగలుగుతారు. అయితే 22, 24,25 తేదీలలో అశుభ వార్తలు వినుటకు అవకాశం కలదు.
ఆగస్టు 2021 వృచ్చిక రాశి ఫలాలు:
ఈ మాసంలో ముఖ్యంగా అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొనుట మంచిది కాదు. అలా వ్యవహరించుట వలన గౌరవ ప్రదమైన జీవనం పోగొట్టుకుంటారు ధనాదాయం సామాన్యం. ద్వితియ వారంలో చేయు ప్రయాణములు ఫలించును.విదేశీ జీవన పరమైన పరీక్షలు లేదా ఇంటర్వ్యూ లు ఎదుర్కోను వారికి విజయం లభిస్తుంది. ఆశించిన విదేశీ ఉద్యోగం లభించును. తృతీయ వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. మాసాంతంలో వ్యాపార వర్గం వారికి చక్కటి వ్యాపార లాభములు ఏర్పడుతాయి ఈ మాసంలో 4,6,10,15,18,22, తేదీలు అనుకూలమైనవి కావు.
సెప్టెంబర్ 2021 వృచ్చిక రాశి ఫలాలు:
ఈ మాసంలో మీ గృహ సంబంధ ప్రణాళికలు కార్యరూపం దాల్చును. ఆప్త మిత్రులతో చిన్నపాటి కలహం ఏర్పడుతుంది. ధనాదాయం బాగుండును. ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి న్యాయబద్ధమైన ధనార్జన ఏర్పరచు ఉద్యోగ జీవనం ఆరంభం అగును. వృత్తి వ్యాపారములు జయవంతంగా కొనసాగును. వివాహ సంబంధ చర్చలు సఫలమగుటకు చాలా కష్ట పడవలసి వస్తుంది. మధ్యవర్తులను అతిగా నమ్ముట మంచిది కాదు. ఈ మాసంలో 7,8,9,10 తేదీలలో భూ లేదా గృహ సంబంధ మార్పులు లేదా పెట్టుబడులు లాభించును.
అక్టోబర్ 2021 వృచ్చిక రాశి ఫలాలు:
ఈ మాసం అంత అనుకూలమైన ఫలితాలను కలిగించదు. ఆకస్మిక సమస్యల వలన ధన వ్యయము అధికం అగును. ఉష్ణ సంబంధమైన అనారోగ్యము చికాకు కలుగచేయును. ఈ మాసంలో ఒక పర్యాయం కేతు మరియు గురు గ్రహ శాంతి జరిపించుకోనుట మంచిది.
నవంబర్ 2021 వృచ్చిక రాశి ఫలాలు:
ఈ మాసం కూడా వివధ అవాంతరములను, ఇబ్బందులను కలిగించును. ఉద్యోగ జీవనంలోని వారికి ఉద్యోగ నష్టము ఏర్పడుతుంది. దేనిని దృష్టిలో పెట్టుకొని ఆర్ధిక ప్రణాళికలు రూపొందించుకోవాలి. జీవిత భాగస్వామితో కుటుంబ నిర్వహణ పరమైన విభేదాలుమానసిక అశాంతి ఏర్పరచును. సొంత మనుష్యుల వలననే గౌరవ హాని ఎదుర్కొంటారు. వృధా ప్రయత్నాలు భాదించు సూచన. మాసాంతంలో భవిష్యత్ గురించిన అనవసర భందోళనలు ఉండగలవు.
డిశంబరు 2021 వృచ్చిక రాశి ఫలాలు:
ఈ మాసంలో 6 వ తేదీ తదుపరి లాభకరమైన పరిస్థితి పొందుతారు. గత రెండు నెలలలో ఎదుర్కొన్న చికాకులు క్రమేపి తొలగును. నిలిచిన వ్యాపార వృత్తులు తిరిగి ప్రారంభమగును. నూతన లేదా ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలించును. స్త్రీ సంబంధ విషయాలలో అనుకూలత ఏర్పడును. చివరి వారంలో ప్రారంభించిన నూతన వృత్తి మార్గములు లాభించును. పితృ వర్గం నుండి ఆర్ధికంగా సహకారం లభించును.
జనవరి 2022 వృచ్చిక రాశి ఫలాలు:
ఈ మాసం అనుకూల వాతావరణం ఏర్పరచును. కష్టానికి తగిన ఫలములు పొందుతారు. మహిళలు తమ స్వ వ్యవహార దక్షతతో చాలా పెద్ద సమస్య నుండి బయట పడతారు. భాత్రు వర్గంతో అవగాహన ఏర్పడుతుంది. ఈ మాసంలో ధనానికి ఇబ్బంది ఉండదు. ఆరోగ్య సమస్యల నుండి బయట పడతారు. వైద్యుల అభిప్రాయం తలక్రిందులు అవుతుంది. విద్యార్దులు, విదేశీ ప్రయత్నములు చేయువారికి, స్థాన చలనము నకు ప్రయత్నించు వారికి ఈ మాసం శుభకరం. మనోవంచా ఫలసిద్ధి ఏర్పడును. పేరు ప్రఖ్యాతలు పెరుగును.
ఫిబ్రవరి 2022 వృచ్చిక రాశి ఫలాలు:
ఈ మాసం కూడా కలసి వచ్చును. వివాహ ప్రయత్నములు చేయువారికి, ధన వెసులుబాటు కొరకు ప్రయత్నించు వారికి ఇది చక్కటి కాలం. ప్రభుత్వ ఉద్యోగ జీవనంలోని వారికి వాహనముద్రిదికార యోగం నూతన పరిచయాలు ఏర్పడుతాయి. మాసం మొత్తం ధనాదాయం బాగుండును. గృహంలో నూతన వస్తువులను అమర్చుకోగలరు. మానసికంగా కుదుటపడుతారు. పొదుపు పధకాలు లాభాలను కలుగచేస్తాయి.
మార్చి 2022 వృచ్చిక రాశి ఫలాలు:
ఈ మాసంలో ప్రధమ వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. ద్వితియ వారంలో ఊహించని విధంగా అపవాదులు భరిస్తారు. అకారణంగా మాటపడుట తీవ్రంగా భాదిస్తుంది. ఈ మాసంలో ఆదాయ వ్యయములు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవహార చిక్కుల వలన కొన్ని కార్యములను మధ్యలోనే విడిచిపెట్టుట చేస్తారు. మాసాంతంలో కుటుంబ సంతోషాలు అనుభవిస్తారు. ఈ మాసంలో 11,12,13 తేదీలు అనుకూలమైనవి కావు.
– శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యాలయం
Also Read : Horoscope Zodiac Signs 2021-2022 : ప్లవ నామ సంవత్సరం పంచాంగం.. అన్ని రాశుల ఫలితాలు
Also Read : Horoscope Mesha Raasi Aries : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మేష రాశి ఫలాలు
Also Read : Horoscope Vrushabha Raasi Taurus : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వృషభ రాశి ఫలాల
Also Read : Horoscope Midhuna Raasi Gemini : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మిధున రాశి ఫలాలు
Also Read : Horoscope Karkataka Raasi Cancer : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కర్కాటక రాశి ఫలాల
Also Read : Horoscope Simha Raasi Leo : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర సింహ రాశి ఫలాలు
Also Read: Horoscope Kanya Raasi virgo : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కన్యా రాశి ఫలాలు
Also Read : Horoscope Thula Raasi Libra : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర తులా రాశి ఫలాలు
Also Read : Horoscope Dhanassu Raasi saggitarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనస్సు రాశి ఫలాలు
Also Read : Horoscope Makara Raasi Capricorn : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మకరరాశి ఫలాలు
Also Read : Horoscope Kumbha Raasi aquarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కుంభరాశి ఫలాలు
Also Read : Horoscope Meena Raasi Pisces : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మీనరాశి ఫలాలు
మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.