Vinayakan: స్టేజ్‌పై ఆడవారిని కించపరిచేలా మాట్లాడిన సీనియర్ నటుడు..
Cinema Latest

Vinayakan: స్టేజ్‌పై ఆడవారిని కించపరిచేలా మాట్లాడిన సీనియర్ నటుడు..

Vinayakan: ‘మీ టూ’ మూమెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళలు తమకు జరిగిన అన్యాయాలను ధైర్యంగా చెప్పుకోవడానికి ఉపయోగపడింది మీ టూ. అయితే మీ టూకు ఎంత పాజిటివిటీ వచ్చిందో.. అంతే నెగిటివిటీ కూడా వచ్చింది. ప్రస్తుతం ఆ మీ టూ మూమెంట్ గురించి చాలామంది మర్చిపోయారు. కానీ తాజాగా ఓ మలయాళ నటుడు మళ్లీ మీ టూ గురించి ప్రస్తావించడమే కాకుండా కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్స్ కూడా చేశాడు.

ఎన్నో సినిమాల్లో విలన్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా కనిపించాడు వినాయకన్ (Vinayakan). ముఖ్యంగా తమిళ, మలయాళ చిత్రాల్లో ఆయన చేసిన విలన్ రోల్స్‌తో చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తాను తమిళంలో ‘ధృవ నాచ్చరితమ్’ సినిమాలో నటిస్తున్నాడు. మలయాళంలో ‘ఒరుత్తే’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో వినాయకన్ చేసిన స్టేట్‌మెంట్స్ వల్ల మాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగింది.

Oruthee Movie Trailer: https://youtu.be/0fRgHKDXoeE

అసలు మీ టూ మూమెంట్ అంటే ఏంటో తనకు అర్థం కాదు అన్నాడు వినాయకన్. అది ఒక మహిళను శారీరిక ప్రయోజనం కోసం అడగడమా అంటూ కించపరిచేలా మాట్లాడాడు. తనకు 10 మంది మహిళలతో శారీరిక సంబంధం ఉందన్న విషయాన్ని బయటపెట్టాడు. ఆయనకు ఎవరైనా నచ్చితే డైరెక్ట్‌గా వెళ్లి తనకు కావాల్సింది అడుగుతానని, ఒకవేళ తను కాదంటే ఇక తనను పట్టించుకోడని తెలిపాడు.

Also Read: https://www.sirimalli.com/today-26-march-2022-daily-horoscope-in-telugu/

వినాయకన్ మాట్లాడిన ఈ మాటలు ఒక్కసారిగా మాలీవుడ్‌లో పెద్ద దుమారాన్ని రేపాయి. పెద్ద పెద్ద నటులు సైతం తన మాటలు కరెక్ట్ కాదని ఖండించారు. అంతే కాకుండా వినాయకన్ అలా మాట్లాడుతున్నప్పుడు స్టేజ్‌‌పై ఉన్న నటీమణులు కూడా ఎవరూ మాట్లాడకపోవడంతో నెటిజన్లు దీనిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంత పెద్ద సీనియర్ యాక్టర్ అయ్యిండి వినాయకన్ దగ్గర నుండి ఇలాంటి మాటలు ఊహించలేదని మహిళలు మండిపడుతున్నారు.