Cinema

Vakeel Saab : వకీల్ సాబ్ ట్విట్టర్ రివ్యూ.. నెటిజన్ల అభిప్రాయం ఎలా ఉందంటే..

Vakeel Saab : వకీల్ సాబ్ ట్విట్టర్ రివ్యూ చూస్తే.. వకీల్ సాబ్ సినిమాపై పవన్ కల్యాణ్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఇప్పుడు వకీల్ సాబ్ గా పవన్ కల్యాణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను ఓ మంచి పాయింట్ తో తీశారు. అందుకే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో పవన్ కు జతగా శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేశారు. వకీల్ సాబ్ (Vakeel Saab) లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్ నటించారు. ఈ సినిమాకు ఐఎండీబీ ఏకంగా 8.6 రేటింగ్ ఇచ్చింది.

IMDB Review : వకీల్ సాబ్ కు ఐఎండీబీ రేటింగ్

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. హిందీలో వచ్చిన పింక్ చిత్రానికి రీమేక్. తమిళంలో అజిత్ హీరోగా తీశారు. మూడు భాషల్లోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ట్విట్టర్ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలోనూ పవన్ ఫ్యాన్స్ సూపర్ సక్సెస్ అందించారు. మంచి టాక్ వచ్చింది. అట్లాంటాలో ప్రీమియర్ షో సెలబ్రేషన్స్ అదిరిపోయాయి.

వందకోట్లు రాబడుతుందని టాక్ :

ఈ సినిమా కచ్చితంగా వంద కోట్లు రాబడుతుందని సినీ వర్గాల టాక్. అభిమానుల మాట ప్రకారం.. పవన్ కల్యాణ్ తెరపై అద్భుతంగా నటించారని టాక్. ముఖ్యంగా కోర్టు సీన్స్ మళ్లీ మళ్లీ చూడొచ్చంటున్నారు. సెలబ్రెటీలు కూడా పవన్ రీ ఎంట్రీ అద్భుతమని, మంచి సినిమాను అందించారని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఓవర్సీస్ లో అయితే పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ. మూడేళ్ల తరువాత వచ్చినా.. పవర్ స్టార్ ఫుల్ పవర్ తో వచ్చారని సంబరపడుతున్నారు.

మూడేళ్ల గ్యాప్ తరువాత :

పవన్ కల్యాణ్ సినిమా అంటేనే ఫుల్ ఎనర్జీ ఉంటుంది. రాజకీయాల్లోకి వెళ్లిపోయినా సినిమాలను మాత్రం వదల్లేదు. కాకపోతే మూడేళ్ల పాటు గ్యాప్ రావడంతో అభిమానులు కాస్త నిరాశపడ్డారు. కానీ ఇప్పుడు అంతకుమించి డబుల్ ఎనర్జీతో రావడం, సొసైటీ అంతా మెచ్చుకునే మంచి సినిమాను అందించడంతో వారి అభిమానానికి హద్దే లేకుండా పోయింది. అందుకే పవర్ స్టార్ ఫవర్ ఫుల్ కమ్ బ్యాక్.. అదిరిపోయింది అంతే!

హిందీ పింక్ కు రీమేక్ గా:

హిందీలో పింక్ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ వచ్చింది. హిందీలో అయితే సందేశాత్మక సినిమాగా తెరకెక్కింది. కానీ తెలుగులో మాత్రం కమర్షియల్ సినిమాగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పైగా పవన్ కల్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని భారీగా మార్పులు చేశారు. ఈ మార్పులన్నింటికీ దుబాయ్, అమెరికా లాంటి చోట్ల మంచి స్పందన వచ్చింది. అక్కడ ప్రదర్శించిన ప్రీమియర్ షోలకు పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకే సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు.

Alsoe Read : Pushpa Raj : ‘తగ్గేదే లే’.. ఊరమాస్‌ లుక్‌లో ‘పుష్ప’ టీజర్..!

Also Read : వకీల్ సాబ్ కి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage