Bhakthi

TTD : భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ.. ఆ టిక్కెట్ల విషయంలో..

TTD : శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంతోకాలం ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపాన్ని కళ్లారా చూడాలన్నదే వారి చిరకాల కోరిక. అందుకే వారు టీటీడీ ఇచ్చే దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో ఒకే దగ్గర ఎక్కువ మంది గుమిగూడడం ప్రమాదకరం. అందుకే భక్తులకు దర్శనం విషయంలో టీటీడీ (TTD) వెసులుబాటు కల్పించింది.

భక్తులు ఈనెల 21 నుంచి 30 వరకు దర్శనాల కోసం భక్తులు  ఆన్ లైన్ లో రూ.300 టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. కానీ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఈసమయంలో  భక్తులు కొంతమంది ప్రయాణాలు చేయలేని పరిస్థితి. అందుకే అలాంటివారి సమస్యలను అర్థం చేసుకున్న టీటీడీ వారికి స్వామివారి దర్శనం విషయంలో మరొక అవకాశాన్ని ఇచ్చింది.

ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకుని.. కొవిడ్ పరిస్థితుల కారణంగా తిరుమలలోని వెంకటేశ్వరుడి దర్శనానికి రాలేని భక్తులు.. వచ్చే 90 రోజుల్లో స్వామిని దర్శించుకోవచ్చని తెలిపింది. దీంతో భక్తులకు ఊరట కలిగింది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతుండడంతో టీటీడీ కొన్ని నిర్ణయాలను అమల్లోకి తెచ్చింది.

కరోనా పరిస్థితులను దృష్టిలో  ఉంచుకుని తిరుమలలో ఇప్పటికే సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను జారీ చేయడం నిలిపివేసింది. ఇప్పటికే ఎవరైనా.. దగ్గు, జలుబు, ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు.. తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని విజప్తి చేసింది.  శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నియమాలు పాటించాలని కోరింది.

కిందటేడాది కూడా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో భక్తులకు స్వామి వారి దర్శనాన్ని రద్దు చేసింది టీటీడీ.  ఇప్పుడు కూడా కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే భక్తుల ఇబ్బందులను, పరిస్థితులను గమనించిన టీటీడీ .. ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంది.

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Horoscope : 19-04-2021 సోమవారం నేటి రాశిఫలాలు .

Also Read: Today Panchangam : 19-04-2021 సోమవారం నేటి పంచాంగం

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage