Jr.NTR Corona Positive : జూనియర్ ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్

జూనియర్ ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్

Jr.NTR Corona Positive : కరోనా మహమ్మారి అందరిపైనా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. సినిమా సెలబ్రెటీలు కూడా చాలామంది కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ లో ఇప్పటికే కొంతమంది కరోనా బారినపడి కోలుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయినాసరే ఎవరూ ఆందోళన చెందవద్దని.. తాను బాగున్నానని చెప్పారు..

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన కుటుంబం ఐసోలేషన్ లోకి వెళ్లింది. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు ఇచ్చిన సలహాలు, సూచనలను పాటిస్తు్న్నారు. అయితే గత కొద్ది రోజులుగా తనను కలిసిన వాళ్లంతా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే టాలీవుడ్ లో పవన్ కల్యాణ్, దిల్ రాజు, అల్లు అర్జున్, రామ్ చరణ్, రాజమౌళి కుటుంబం, పూజాహెగ్డే, నివేదా థామస్, బండ్ల గణేశ్ ఇలా చాలా మంది సెలబ్రెటీలు కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కుటుంబం, శిల్పాశెట్టి కుటుంబం, కంగనారనౌత్.. ఇలా చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా నిర్మాణం వాయిదాపడింది. ఈ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తు్న్నారు.

ఇవి కూడా చదవండి : 

Also Read : Corona Virus : కరోనా అంటే భయపడేవారు ముందు ఇది చదవండి.. ధైర్యం వస్తుంది

Also Read : Corona Virus : వార్నీ.. ఆ ఒక్క విటమిన్ విషయంలో జాగ్రత్తగా ఉంటే.. కరోనాను ఢీ కొట్టచ్చా?

Also Read : Mahabharata Success Story On Coronavirus : మహాభారతంలో ఈ అస్త్రం లేని యుద్ధం కథ గురించి తెలిస్తే.. కరోనాపై ఈజీగా గెలవచ్చు

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage