Cinema

Pooja Hegde : బుట్టబొమ్మకు కరోనా పాజిటివ్.. అంతకుముందే శుభవార్త చెప్పి.. ఇంతలోనే ఇలా..!

Pooja Hegde : టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరంటే.. మరో మాట లేకుండా చెప్పే పేరు.. పూజా హెగ్డే. బుట్టబొమ్మకు అంత డిమాండ్ ఉంది మరి. కానీ తనకు కరోనా వచ్చిందంటూ పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ చలాకీగా ఉండే బుట్టబొమ్మ ఒక్కసారిగా డీలా పడేసరికీ బాధపడ్డారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజాహెగ్డే (Pooja Hegde) అదే సోషల్ మీడియా వేదికగా తనకు కరోనా వచ్చిన విషయాన్ని పోస్ట్ చేసింది.

Pooja Hegde Twitter Post
Pooja Hegde Twitter Post

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్, చెర్రీ, దిల్ రాజు, నివేదా థామస్.. ఇలా చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ మహమ్మారి ఏమూల నుంచి దాడి చేస్తుందో కనిపెట్టడం చాలా కష్టం. అందుకే ఎక్కువమందికి ఇది సోకుతోంది. ఇప్పుడు పూజాహెగ్డే కూడా అలాగే కరోనా బారిన పడ్డారు.

Pooja Hegde Still
Pooja Hegde Still

సినీ ఇండస్ట్రీలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే వాళ్లు ఉండేదే పబ్లిక్ లైఫ్ లో. షూటింగ్ ల కోసం అవుట్ డోర్ తప్పదు. అలాంటప్పుడు కరోనా సోకే అవకాశాలు చాలా ఎక్కువ. అక్కడికీ చాలాకాలం పాటు షూటింగ్ లను వాయిదా వేశారు. ఇంకా ఆపితే ఇండస్ట్రీ మొత్తం లాస్ అవుతుంది. అందుకే మొన్నామధ్య సినిమా షూటింగ్ లను మళ్లీ మొదలుపెట్టారు. దీంతో ఎక్కువమందిపై కరోనా ఎఫెక్ట్ కనిపిస్తోంది.

Pojja Hegde Image
Pojja Hegde Image

బుట్ట బొమ్మ పెట్టిన కరోనా పోస్ట్ కూడా వైరల్ అయ్యింది. హెలో ఎవిరివన్ అంటూ మొదలుపెట్టింది. తనకు కరోనా వచ్చిన విషయాన్ని అందరికీ చెప్పదలుచుకున్నానని, అందుకే రూల్స్ ని ఫాలో అవుతూ తనకు తానే స్వీయ నిర్బంధంలోనికి వెళుతున్నానని ప్రకటించింది. ఇప్పుడు ఆమె సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. తనను గత కొద్దిరోజులుగా కలిసినవారంతా పరీక్షలు చేసుకోవాలని కోరింది. అందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని చెప్పింది.

Pooja Hegde Latest Image
Pooja Hegde Latest Image

అంతకుముందే తనను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నవారు కోటీ 30 లక్షలు దాటారంటూ సంతోషంగా చెప్పింది. ఆ విషయాన్ని తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. కానీ ఇంతలోనే ఇలాంటి విషాదకరమైన వార్తను చెప్పింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కు ఆవేదన తప్పలేదు. ఇన్ స్టాలో కోటీ 30 లక్షల మంది ఫాలోవర్లు అంటే మాటలు కాదు. ఈ పొడుగుకాళ్ల సుందరికి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ తో రాధేశ్యామ్, చిరంజీవితో ఆచార్య, అఖిల్ తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ సినిమాల్లో నటిస్తోంది. ఇక తమిళ గడ్డపై ఎదురులేని హీరో.. ఇళయ దళపతి విజయ్ 65వ చిత్రంలోనూ హీరోయిన్ గా చేస్తోంది. బాలీవుడ్ లో రణవీర్ సింగ్ డబుల్ రోల్ చేస్తు్న్న సర్కస్ లోనూ నటించనుంది. ఆమె త్వరగా కోలుకోవాలని సిరిమల్లి.కామ్ కోరుకుంటోంది.

Pooja Hegde and Akhil Akkineni
Pooja Hegde and Akhil Akkineni

Also Read : Nabha Natesh : పసుపుపచ్చ కోకలో కుర్రకారుకు పిచ్చెక్కించే ఫోజులిచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ

Also Read : Krithi Shetty : హాఫ్ శారీలో కేక పుట్టిస్తున్న కృతీశెట్టి.. కన్నడ పిల్ల సొగసే సొగసు

Also Read : Vakeel Saab Heroine Anjali : వకీల్ సాబ్ హీరోయిన్.. అంజలి కలర్ ఫుల్ పిక్స్.. శారీ ఫోటోస్ అదుర్స్

Also Read : Potti Veeraiah : టాలీవుడ్ మరుగుజ్జు నటుడు ఇక లేరు, తీవ్ర విషాదంలో చిత్ర పరిశ్రమ

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage