2024-07-18 01:54:23
Today Horoscope : 29-08-2021 ఆదివారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 29-08-2021 ఆదివారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 29-08-2021 ఆదివారం… నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (29-08-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు దైవ చింతన పెరుగుతుంది బంధు మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.

వృషభ రాశి (Taurus) :

చేపట్టిన పనులు వాయిదా వేయడం మంచిది కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార వ్యవహారాలలో స్వంత ఆలోచనతో ముందుకు సాగడం మంచిది ఉద్యోగమున పనిభారం తప్పదు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

మిధున రాశి (Gemini) :

సన్నిహితుల నుండి ఊహించని ధన సహాయం అందుతుంది..చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు..కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు చేపట్టిన పనులలో కార్యసిద్ది కలుగుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

కర్కాటక రాశి (Cancer) :

ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. వ్యాపారమున ఆశించిన అభివృద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

సింహ రాశి (Leo) :

చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆదాయం విషయంలో నిరాశ తప్పదు ఉద్యోగమున చిన్నపాటి వివాదాలుంటాయి వృత్తి వ్యాపారములలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య రాశి (Virgo) :

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. నూతన ఋణ ప్రయత్నాలు కొంతవరకు కలిసివస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా స్థానచలనాలుంటాయి బంధు వర్గం వారితో మాట పట్టింపులుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra)

సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పాతమిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చిక రాశి (Scorpio) :

నూతన ఆలోచనలను కార్యరూపం దాల్చుతాయి.ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. నూతన వస్త్రా ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

ధనస్సు రాశి (Sagitarus) :

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యులతో ఊహించని కలహాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి.

మకర రాశి (Capricorn) :

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆప్తుల నుండి అందిన సమాచారం కొంత మానసికంగా బాధిస్తుంది. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. పాతరుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కుంభ రాశి (Aquarius) :

ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. ఆప్తులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికామౌతుంది.

మీన రాశి (Pisces) :

పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. చుట్టు పక్కలవారితో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపడతారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read  : Weekly Horoscope : ఈ వారం రాశి ఫలాలు 29-08-2021 నుంచి 04-09-2021 వరకు

Also Read : Today Panchangam : 29-08-2021 ఆదివారం .. నేటి పంచాంగం…

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..
తాజా సమాచారం కోసం మాసిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి
Https://Www.Facebook.Com/SirimalliPage