Today Horoscope : 26-05-2021 బుధవారం నేటి రాశిఫలాలు..

Today Horoscope : 26-05-2021 బుధవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు(Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి

SREE KRUPA (26-05-2021) రాశి ఫలితాలు

మేషం (Aries) :

స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది నిరుద్యోగులు కష్టానికి తగ్గ ఫలితం లభించదు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు.

వృషభం (Taurus) :

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.పాత మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

మిధునం (Gemini) :

ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి స్నేహితుల సహాయంతో రుణాలు పెరుగుతాయి సోదరులతో వివాదాలు కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

కర్కాటకం (Cancer) :

వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి . దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు ఉద్యోగ వాతావరణం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం.

సింహం (Leo) :

నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపు ఉంటాయి.ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారస్తులకు ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య (Virgo) :

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.వ్యాపారానికి నూతన పెట్టుబడులకు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి నుండి బయట పడతారు.

తుల (Libra) :

కుటుంబ సభ్యుల నుండి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులుచేస్తారు.ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.

వృశ్చికం (Scorpio) :

రాబడి మరింత సంతృప్తి కలిగిస్తుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులు సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు శ్రమ ఉన్నపటికీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనస్సు (Sagitarus) :

సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది.

మకరం (Capricorn) :

ముఖ్యమైన పనులలోఅప్రయత్నకార్యసిద్ధి కలుగుతుంది నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారం మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగస్తులకు అధికారుల అండదండలతో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.

కుంభం (Aquarius) :

వృత్తి ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. భూ వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఊహించని అవకాశాలు లభిస్తాయి.

మీనం (Pisces) :

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి.బంధు మిత్రులు నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టి నష్టాలను ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 26-05-2021 బుధవారం.. నేటి పంచాంగం

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage