Bhakthi

Today Horoscope : 25-04-2021 ఆదివారం నేటి రాశిఫలాలు

Today Horoscope : 25-04-2021 ఆదివారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల (Today Horoscope) ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (25-04-2021) రాశి ఫలితాలు

మేషం :

దూర ప్రాంత బంధు మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. సమాజంలోప్రముఖుల పరిచయాలతో కీలకమైన పనులు పూర్తిచేస్తారు. నూతనవ్యాపారాలకు శ్రీకారం చుడతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది.

వృషభం :

కుటుంబ సంబంధిత బాధ్యతలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆరోగ్యవిషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి .నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కీలక విషయాలలో ఆలోచనలు స్థిరత్వం లోపిస్తుంది.

మిధునం :

అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.మాతృ సంభందీకులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార నష్ట సూచనలున్నవి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి మిత్రులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

కర్కాటకం :

ఉద్యోగమున పని ఒత్తిడి నుండి బయట పడతారు. బంధు, మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం :

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు ఉంటాయి. సోదరులతో భూ సంబంధిత వివాదాలు ఉంటాయి. ధన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. నేత్ర సమస్యలు కలుగుతాయి.

కన్య :

గృహమున దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తిఅవుతాయి. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘ కాలిక ఋణాలు తీర్చగలుగుతారు.

తుల :

గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి ఇంటాబయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.

వృశ్చికం :

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా వ్యవహారాలు మరింత సంతృప్తి కలిగిస్తాయి. ఆప్తుల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి,ఉద్యోగాల్లో ఉత్సహంగా సాగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

ధనస్సు :

రావలసిన మొండి బాకీలు వసూలు అవుతాయి. సేవ కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి,ఉద్యోగాలలోఅనుకూలత పెరుగుతుంది. గృహమున వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.

మకరం :

ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

కుంభం :

నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది దూరా ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక ఇబ్బందు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది.

మీనం :

ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల తొలగుతాయి. ఆర్ధిక విషయంలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యాపారపరంగా పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్సనం చేసుకుంటారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Panchangam : 25-04-2021 ఆదివారం నేటి పంచాంగం

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage