2024-07-18 01:29:40
Today Horoscope : 24-05-2021 సోమవారం నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 24-05-2021 సోమవారం నేటి రాశిఫలాలు..

Today Horoscope : 24-05-2021 సోమవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు(Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి

SREE KRUPA (23-05-2021) రాశి ఫలితాలు

మేషం (Aries) :

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుండిఆదాయంఅందుతుంది. నూతనవ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం (Taurus) :

ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమించి ముందుకు సాగుతారు. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి.

మిధునం (Gemini) :

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

కర్కాటకం (Cancer) :

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

సింహం (Leo) :

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

కన్య (Virgo) :

వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.

తుల (Libra) :

దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతనవాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

వృశ్చికం (Scorpio) :

ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.

ధనస్సు (Sagitarus) :

ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు. పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి.

మకరం (Capricorn) :

ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు. వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

కుంభం (Aquarius) :

అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.

మీనం (Pisces) :

ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నూతన వస్త్రఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 24-05-2021 సోమవారం… నేటి పంచాంగం

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage