Today Horoscope : 24-06-2021 గురువారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 24-06-2021 గురువారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope)  ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (24-06-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు తొలగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబ సభ్యుల నుండి ఊహించని ఒత్తిడులు పెరుగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు స్వల్పంగా రాణిస్తాయి.

వృషభ రాశి (Taurus) :
నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల ఆశాజనకంగా ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది .నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు

మిధున రాశి (Gemini) :

అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు.దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఉద్యోగస్తులకు అవకాశాలు లభిస్తాయి

కర్కాటక రాశి (Cancer) :

ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. సేవా కార్యక్రమాలలో మిత్రులతో పాల్గొంటారు ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లేక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు చెయ్యను పనికి నిందలు ఎదుర్కొంటారు

సింహ రాశి (Leo) :

చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి . దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి

కన్య రాశి (Virgo) :

సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తొలగి అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారస్తులకు అనుకున్న సమయానికి పెట్టుబడులు అందుతాయి

తుల రాశి (Libra) :

పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది

వృశ్చిక రాశి (Scorpio) :

గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు చేస్తారు. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి.ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు

ధనస్సు రాశి (Sagitarus) :

దీర్ఘకాలిక సమస్యలు మరింత చికాకు పరుస్తాయి చేపట్టిన పనులలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.మానసిక అనారోగ్య సమస్యలు కొంత ఒత్తిడి కలగజేస్తాయి.కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి విమర్శలు ఎదురవుతాయి వ్యాపారస్థులకు అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు నిరుద్యోగ ప్రయత్నాల్లో నిదానంగా సాగుతాయి

మకర రాశి (Capricorn) :

విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఆర్థికంగా మరింత అభివృద్ధి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తొలగుతాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలను నూతన హోదాలు పొందుతారు

కుంభ రాశి (Aquarius) :

ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. సోదరులకు స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి

మీన రాశి (Pisces) :

దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.నూతన ఋణ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి.కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. దూరపు బంధువుల రాక కొంత ఆనందం కలిగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read: Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read :  Today Panchangam : 24-06-2021 గురువారం… నేటి పంచాంగం..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage