Today Horoscope : 24-08-2021 మంగళవారం… నేటి రాశిఫలాలు..

Today Horoscope : 24-08-2021 మంగళవారం … నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (24-08-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో భాగస్తులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

వృషభ రాశి (Taurus) :

మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

మిధున రాశి (Gemini) :

ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు మరింత మందగిస్తాయి నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

కర్కాటక రాశి (Cancer) :

కీలక వ్యవహారాలలో సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులులో శ్రమాధిక్యత కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేరు. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహ రాశి (Leo) :

గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అవసరానికి చేతికిడబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మిత్రులతో కీలక విషయాలలో చర్చలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కన్య రాశి (Virgo) :

నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సమస్యల పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra)

చేపట్టిన పనుల్లో అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూరప్రయాణ సూచనలున్నవి. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప ధన నష్టాలుంటాయి వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

వృశ్చిక రాశి (Scorpio) :

వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి, నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు.కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి.

ధనస్సు రాశి (Sagitarus) :

వ్యాపారస్తులకు నూతన అవకాశములు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలలో వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుండి బయట పడతారు.

మకర రాశి (Capricorn) :

కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి. వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణ ప్రయత్నాలు కలసిరావు.

కుంభ రాశి (Aquarius) :

నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. ఉద్యోగమున ఆశించిన మార్పులు కలుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

మీన రాశి (Pisces) :

చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి వ్యాపారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు ఆశించిన రీతిలో ఉంటాయి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read  : Weekly Horoscope : ఈ వారం రాశి ఫలాలు 22-08-2021 నుంచి 28-08-2021 వరకు

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 24-08-2021 మంగళవారం… నేటి పంచాంగం…

తాజా సమాచారం కోసం మాసిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి
Https://Www.Facebook.Com/SirimalliPage