2024-07-14 00:39:24
Today Horoscope : 22-05-2021 శనివారం నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 22-05-2021 శనివారం నేటి రాశిఫలాలు..

Today Horoscope : 22-05-2021 శనివారంనేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు ఈ విధంగా ఉన్నాయి

SREE KRUPA (22-05-2021) రాశి ఫలితాలు

మేషం (Aries) :

గృహమునకు ఆప్తులు ఆగమన ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం (Taurus) :

దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యతపెరుగుతుంది. సంతానంతోమనస్పర్థలు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగమున నిరుత్సాహవాతావరణం ఉంటుంది.

మిధునం (Gemini) :

చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కర్కాటకం (Cancer) :

గృహనిర్మాణవిషయంలోఅంచనాలునిజమవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. నూతన వస్తు వాహన లాభాలు అందుకుంటారు. వ్యాపారాలు నిలకడగా రాణిస్తాయి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. సోదరుల సహాయ సహకారాలు అందుతాయి.

సింహం (Leo) :

కుటుంబం వాతావరణం చికాకుగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో కొత్త సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగాలలోఅధికారులనుండి విమర్శలు తప్పవు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయమై జాగ్రత్త వహించాలి. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.

కన్య (Virgo) :

ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి కుటుంబ వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. ఆప్తుల నుండి వ్యాపారమునకు నూతన పెట్టుబడులు దక్కుతాయి. పెద్దల సహాయ సహకారాలతో నిరుద్యోగులకు తగిన అవకాశములు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

తుల (Libra) :

చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదావెయ్యడం మంచిది. విద్యార్థులు మరింత కష్టపడాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. వ్యాపార, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి. స్ధిరాస్తి వివాదాలుంటాయి. మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం (Scorpio) :

వృత్తి వ్యాపారాలు గతంకంటే మెరుగ్గా ఉంటాయి. గృహ నిర్మాణ విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన హోదాలు లభిస్తాయి. గృహ వాతావరణం సంతోషంగాఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

ధనస్సు (Sagitarus) :

సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో సమయానుకూలంగా వ్యవహరించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులు దీర్ఘకాలిక సమస్యలు నుండి బయటపడతారు.

మకరం (Capricorn) :

కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్ధిక సమస్యలు మరింత భాదిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టాడతారు.

కుంభం (Aquarius) :

ఇంటబయట గందరగోళ పరిస్థితులుంటాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తికాక చికాకు పెరుగుతుంది అవసరానికి చేతిలో ధనం నిల్వ లేక నూతన రుణయత్నాలు చెయ్యవలసివస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులుంటాయి.

మీనం (Pisces) :

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వాతావరణం పురోగమిస్తుంది. చాలాకాలంగా పూర్తికాని పనులు అనుకున్న సమయాన్ని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.

Also Read : Today Panchangam : 22-05-2021 శనివారం… నేటి పంచాంగం

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage