Bhakthi

Today Horoscope : 22-06-2021 మంగళవారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 22-06-2021 మంగళవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope)  ఈ విధంగా ఉన్నాయి.

REE KRUPA (22-06-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసే లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

వృషభ రాశి (Taurus) :

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. గృహమును శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదవులు అప్రయత్నంగా దక్కుతాయి.

మిధున రాశి (Gemini) :

ఆర్థికంగా కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కొందరు ప్రవర్తన వలన శిరో బాధలు కలుగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి.

కర్కాటక రాశి (Cancer) :

ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

సింహ రాశి (Leo) :

సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలరు.

కన్య రాశి (Virgo) :

జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసిన నష్టపడతారు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.

తుల రాశి (Libra) :
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు పుణ్యక్షేత్రాలను సందర్శించి ఉంటారు. స్ధిరాస్తి లాభసూచనలు ఉన్నవి. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.

వృశ్చిక రాశి (Scorpio) :

వృధా ప్రయాణాలు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. మిత్రులతో అకారణ కలహ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో ఆశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.

ధనస్సు రాశి (Sagitarus) :

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మకర రాశి (Capricorn) :

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పాత మిత్రులతో కొన్ని విషయాలు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కుంభ రాశి (Aquarius) :

నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులలో శ్రమను మరింత పెరుగుతుంది. బంధు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో నిరాశ తప్పదు. ఉద్యోగ వాతావరణం మరింత గందరగోళంగా ఉంటుంది.

మీన రాశి (Pisces) :

ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో భాగస్తులుతో మాట పట్టింపులు ఉంటాయి ఉద్యోగస్తులకుశ్రమాధిక్యత కలుగుతుంది.ధన ఆదాయమార్గాలు మందగిస్తాయి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read: Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 22-06-2021 మంగళవారం … నేటి పంచాంగం..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage