Today Horoscope : 17-04-2021 శనివారం .. నేటి రాశి ఫలాలు

Today Horoscope : 17-04-2021 శని వారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల (Today Horoscope) ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

మేషం:

ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వెయ్యడం మంచిది ధన వ్యవహారాలలో ఆలోచనలు కలిసిరావు. ఇంటా బయటా సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి.

వృషభం :

అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాలు కలసివస్తాయి. దీర్ఘకాలిక ఋణాలు కొంత వరకు తీరి ఊరట చెందుతారు. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు.

మిధునం :

ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.వృధా ప్రయాణాలుచేస్తారు. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతోఅనుకోని కలహాలు కలుగుతాయి. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం :

కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.పాత మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో పురోగతి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

సింహం :

ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆకస్మిక ధనలబ్ది పొందుతారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కన్య :

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. ఖర్చులు అదుపు చెయ్యడం అవసరం.బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

తుల :

నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు నిలకడ లోపిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి ఉద్యోగస్తులు మాట విషయంలో తొందరపాటు మంచిది కాదు.

వృశ్చికం :

చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్ధిక పురోగతి సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

ధనస్సు :

నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సోదరులనుండి శుభవార్తలు అందుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

మకరం :

ఆర్డీజ వ్యవహారాలలో సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. నూతన వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

కుంభం :

చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. బంధువులతో స్ధిరాస్తి తగాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో శిరోభాధలు తప్పవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

మీనం :

పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగుల అంచనాలునిజమౌతాయి. నిరుద్యోగులకుఉద్యోగ యోగమున్నది.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

– GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు చౌ ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 17-04-2021 శనివారం నేటి పంచాంగం

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage