2024-07-18 00:54:10
Today Horoscope : 16-07-2021 శుక్రవారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 16-07-2021 శుక్రవారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 16-07-2021 శుక్రవారం. నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (16-07-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.

వృషభ రాశి (Taurus) :

ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు చేయడం మంచిది భూ సంబంధిత క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలను ఉంటారు సోదరులతో సఖ్యత గా వ్యవహరిస్తారు వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.

మిధున రాశి (Gemini) :

కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఆర్థికంగా లాభాలు కలిగిస్తాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు అందుతాయి.

కర్కాటక రాశి (Cancer) :

దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థికంగా అనుకూలత తిరిగి రుణాలు చేయగలుగుతారు.

సింహ రాశి (Leo) :

వృత్తి ఉద్యోగాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపారస్థులకు పెట్టుబడులకు ధనాదాయం లభిస్తుంది.

కన్య రాశి (Virgo) :

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra) :

సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి గతంతో పోలిస్తే వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి దూరప్రాంత బంధుమిత్రులు నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది.

వృశ్చిక రాశి (Scorpio) :

16-07-2021

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధనం లభిస్తుంది సోదరుల నుండి స్థిరాస్థి లాభాలు పొందుతారు సంతానం విద్యా విషయాలలో నూతన అవకాశాలున్నాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది వ్యాపారాలు లాభిస్తాయి.

ధనస్సు రాశి (Sagitarus) :

వృత్తి వ్యాపారాలలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. సంతాన విద్య వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తొలగుతాయి. దైవచింతన పెరుగుతుంది.

మకర రాశి (Capricorn) :

దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది.

కుంభ రాశి (Aquarius) :

బంధుమిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలిగి ఊరట చెందుతారు. స్ధిరాస్తి క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీన రాశి (Pisces) :

మిత్రుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెరవేరుతాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఆర్థికంగా వ్యవహారాలు కలసివస్తాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 16-07-2021 శుక్రవారం … నేటి పంచాంగం..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage