Today Horoscope : 15-05-2021 శనివారం నేటి రాశిఫలాలు….

Today Horoscope : 15-05-2021 శనివారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల(Today Horoscope)ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA 15-05-2021) రాశి ఫలితాలు

మేషం :

ప్రారంభించిన పనులు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. రుణ వత్తిడి నుండి బయటపడతారు. గృహమున సోదరులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు.

వృషభం :

బంధువులతో మాటపట్టింపులుంటాయి. ధన పరంగా ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగp వ్యవహారాలలో అలోచించి మాట్లాడటం మంచిది. ఇంట బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది.

మిధునం :

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల ధన సహాయం అందుతాయి. గృహ నిర్మాణ పనులు వేగంగా సాగుతాయి.సంతానానికి నూతన విద్యా అవకాశాలు అందుతాయి. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

కర్కాటకం :

భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చుట్టుపక్కల వారితో భూ వివాదాలు కలుగుతాయి కీలక వ్యవహారాలు నిర్ణయాలలో సొంత నిర్ణయాలు ఫలించవు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

సింహం :

నిరుద్యోగులు అప్రయత్నంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కన్య :

బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఇబ్బందుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. ఆర్ధిక వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. వ్యాపార వ్యవహారాలలో కుటుంబసభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడి అధిగమించి ముందుకు సాగుతారు.

తుల :

ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పద్ధతులుఆచరిస్తారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. దైవానుగ్రహముతో కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం :

స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు కలుగుతాయి బంధువులు కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహం కలిగిస్తాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

ధనస్సు :

వ్యాపారాలలో నూతన అవకాశములు అందుతాయి ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కారమౌతాయి. దూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్ధిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది.

మకరం :

సంఘంలోగౌరవ,మర్యాదలుపెరుగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలు కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వ్యాపారాలలో నూతనపెట్టుబడులు అందుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుతుంది. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కుంభం :

దూరప్రయాణాలు వాయిదా పడతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం భాధ కలిగిస్తుంది. వ్యాపారాలలో విభేదాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సంతాన పరంగా కొన్ని విషయాలు ఆందోళన కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

మీనం :

వాహన ప్రయాణాలలో తొందరపాటు మంచిదికాదు. కొన్ని విషయాలలో కుటుంబ పెద్దల సలహాలు పాటించడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలుంటాయి. ఆప్తుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్ధిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 15-05-2021 శనివారం .. నేటి పంచాంగం

Also Read : మరో జర్నలిస్ట్ ని బలి తీసుకున్న కరోనా.. !

Also Read : Shivani Narayanan : అందాలకు యువరాణి.. ఈ శివాని.. తమిళ స్మాల్ స్క్రీన్ లో బిగ్ బ్యూటీ

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage