Bhakthi

Today Horoscope : 15-04-2021 గురువారం.. నేటి రాశి ఫలాలు

Today Horoscope : 15-04-2021 గురువారం .. నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల ( Today Horoscope) ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (15-04-2021) రాశి ఫలితాలు

మేషం

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక నష్టాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులుంటాయి. దైవకార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్పదు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ​

వృషభం

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వృత్తి , ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది. ​

మిధునం

అవసరానికి డబ్బు అందక ఇబ్బంది పడతారు నూతన రుణాలు చేస్తారు. కొన్ని పనులు చికాకు కలిగిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి ఉద్యోగాలలో ఒత్తిడి పెరుగుతుంది. ​

కర్కాటకం

నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో అనుకూల ఫలితాలుంటాయి. భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ​

సింహం

అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆప్తుల నుండి సహాయం అందుతుంది. ఉద్యోగాలలో ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ​

కన్య

చేపట్టిన పనులు మీ ఓర్పును పరిక్షిస్తాయి. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల మాటలు మానసికంగా స్థిమితం ఉంచవు. ఆలోచనలు అంతగా కలసిరావు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. ​

తుల

కొన్ని వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. పాత మిత్రులతో వివాదాలుంటాయి.అధిక శ్రమకు స్వల్ప ఫలితం పొందుతారు. వ్యాపారములకు పెట్టుబడులు అందక నిరాశ కలుగుతుంది. ఉద్యోగమున పనికి విమర్శలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ​

వృశ్చికం

సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. కుటుంబమున మీమాటకు గౌరవం పెరుగుతుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగాలు నూతన ఆశలు చిగురిస్తాయి. ​

ధనస్సు

బంధువుల నుండి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్థులకుసంతృప్తికరవాతావరణం ఉంటుంది. ​

మకరం

ఆర్థిక వ్యవహారాలు ఒడిదుడుకులుంటాయి. అనవసర విషయాలపై ధనవ్యయం చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన చికాకులు పెరుగుతాయి. దైవ చింతన కలుగుతుంది. వ్యాపారాలలో ఇతరుల వలన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ​

కుంభం

ఇంట బయట పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వెయ్యడం అవసరం. చేపట్టిన పనులలో నిరుత్సాహం తప్పదు. మానసిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. వ్యాపారాలలో ఆర్ధిక ఇబ్బందులుంటాయి. ​

మీనం

నిరుద్యోగ యత్నాలు అనుకూలంగా సాగుతాయి. పాత మిత్రుల కలయికతో గృహమున సందడివాతావరణం ఉంటుంది విందువినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో అధికారుల అండ దండలు లభిస్తాయి. సేవ కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu)      sirimalli.com

 

 

 

 

 

 

 

 

– GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : Today Panchangam : 15-04-2021 గురువారం నేటి పంచాంగం

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములలో ఏది ఉత్తమం? చౌ ఘడియలను చూస్తే..

 

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage