Bhakthi

Today Horoscope : 13-04-2021 మంగళవారం .. నేటి రాశి ఫలాలు..

Today Horoscope : 13-04-2021 మంగళవారం .. నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల ( Today Horoscope) ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా  సిరిమల్లి.కామ్ పాఠకులందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

 

SREE KRUPA (13-04-2021) రాశి ఫలితాలు : 

మేషం : 

నూతనప్రణాళికలు అమలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు మిత్రులు నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృషభం :

మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. పనులలో మరింత ఒత్తిడి పెరుగుతుంది వృత్తి వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపడతారు .ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఉద్యోగాలులో నూతన బాధ్యతలు ఉంటాయి.

మిధునం :

కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల కలయికతో ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.

కర్కాటకం : 

వృత్తి,ఉద్యోగాలలో ఉన్నతికలుగుతుంది. సమాజంలో పెద్దవారి నుండి ఆహ్వానాలు అందుతాయి. రుణగ్రస్తుల నుండి రావలసిన ధనం అందుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.ఉద్యోగాలలో సమయాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు.

సింహం :

సోదరుల నుండి స్ధిరాస్తిసంబంధిత ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు విఫలమవుతాయి ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. సంతాన పరంగా ఇబ్బందులుంటాయి.

కన్య :

ఇంటా బయట పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో గానీ పనులు పూర్తి కావు. బంధుమిత్రుల మాటలతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారమున ఆలోచన లో స్థిరత్వం ఉండదు. ఉద్యోగ విషయాల్లో స్వల్ప సమస్యలు ఉంటాయి.

తుల :

గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ విషయంలో సహోద్యోగులతో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి.

వృశ్చికం :

అవసరానికి సన్నిహితుల నుండి సాయం అందుతుంది వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాదిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పాత విషయాలు గుర్తు చేసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి విద్యార్దులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

ధనస్సు :

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

మకరం :

దూర ప్రయాణం సూచనలు ఉన్నవి.ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.

కుంభం :

అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు తీసుకుంటారు బంధు మిత్రులతో సఖ్యత గా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ విషయంలో అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి.

మీనం : 

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపారాల్లో శ్రమ మరింత పెరుగుతుంది. దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం కావు. ఉద్యోగమున ఒత్తిడి పెరుగుతుంది.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

– GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

 

Also Read : Today Panchangam : 13-04-2021 మంగళవారం నేటి పంచాంగం

Also Read : ఈ ఉగాది రోజున గ్రహాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage