Bhakthi

Today Horoscope : 10-05-2021 సోమ వారం నేటి రాశిఫలాలు..ఈ రెండు రాశుల వారు ఏది పట్టిన బంగారమే !

Today Horoscope : 10-05-2021  సోమ వారం  నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల(Today Horoscope)ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. 

SREE KRUPA 10-05-2021) రాశి ఫలితాలు

మేషం :

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సోదరులు తో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు కొంత మానసిక ఇబ్బంది కలిగిస్తాయి. సేవాకార్యక్రమాలుపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు అందుతాయి.

వృషభం :

నిరుద్యోగులకు ఊహించని విధంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో ఉన్న వివాదాలను శృతిమించకుండా జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిధునం :

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో కష్టసుఖాలు విచారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఆర్ధిక వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. వాహన ప్రయాణాలలో నిదానంగా వ్యవహరించాలి.

కర్కాటకం :

వృత్తి వ్యాపారాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. సోదరులతో భూ వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఉద్యోగమున అనవసర విషయాల్లో జోక్యం చేసుకోక పోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత సానుకూల ఉంటుంది.

సింహం :

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రారంభించిన పనులలో స్వల్ప అవరోధాలు ఉన్నప్పటికీ అధిగమించి పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగార్థులకు ఉన్నతావకాశములు లభిస్తాయి.

కన్య :

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు మరింత అనుకూల పరిస్థితులుంటాయి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధు మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

తుల :

స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలుచేసి ఇబ్బందులకుగురిఅవుతారు. ఉద్యోగస్తులు లభించినఅవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.

వృశ్చికం :

ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమయస్ఫూర్తితో. ఇంట బయట కోపాన్ని అదుపులో ఉంచుకుని ప్రవర్తించడం మంచిది.

ధనస్సు

వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.దీర్ఘకాలిక సమస్యలు కొంత మానసికంగా ఒత్తిడి కలిగిస్తాయి.కుటుంబ సభ్యుల సహాయం వలన కొన్ని పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు మరింత కష్టం తో గానీ ఫలితం లభించదు.

మకరం :

ధనదాయం బాగుంటుంది. కొంతవరకు రుణాలు తీరి ఊరట చెందుతారు. దూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. జీవిత బాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున పరిస్థితులు సంతృప్తి కలిగిస్తాయి.

కుంభం :

ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది దూర ప్రాంతాల బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు ఊహించని లాభాలు అందుకుంటారు. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు.

మీనం :

పనులు సకాలంలో పూర్తి కాకా చికాకు కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగ విషయమై చెయ్యని పనికి నిందలు పడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 10-05-2021 సోమ వారం .. నేటి పంచాంగం

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage