Horoscope Today : ఆ రాశి వారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.. వివిధ రాశుల ఫలితాలు
Bhakthi Latest

Horoscope Today : ఆ రాశి వారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.. వివిధ రాశుల ఫలితాలు

Horoscope Today : ఆ రాశి వారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.. వివిధ రాశుల (Horoscope Today) ఫలితాలు

SREE KRUPA (01-09-2021) రాశుల ఫలితాలు

మేషం – 01-09-2021

నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం -01-09-2021

వృధా ఖర్చు విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగములలో అధికారులతో చికాకులు తప్పవు నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి.

మిధునం – 01-09-2021

నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల ధన సహాయ సహకారాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారపరంగా భాగస్థులతో చర్చలు అనుకూలస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.

కర్కాటకం – 01-09-2021

ఇంటా బయట గందరగోళ వాతావరణం ఉంటుంది దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి స్థిరస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు ఉండవు.ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

సింహం – 01-09-2021

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది గృహంలో వివాహది శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సమాకూరుతాయి.

కన్య – 01-09-2021

ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల – 01-09-2021

పాత రుణాలు ఒత్తిడి వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయటా సమస్యలు అధికమవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత కష్టపడాలి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

వృశ్చికం – 01-09-2021

చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.

ధనస్సు – 01-09-2021

చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి కొంత వరకు బయట పడతారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారమున అనుకూల వాతావరణం ఉంటుంది.ఉద్యోగ ఉన్నత పదవులు పొందుతారు.

మకరం – 01-09-2021

బంధు మిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుం. ది వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.

కుంభం – 01-09-2021

చేపట్టిన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.

మీనం – 01-09-2021

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది.నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలుంటాయి కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనలు వలన మతాపట్టింపులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేయకపోవడం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)