Today Horoscope : 09-08-2021 సోమవారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 09-08-2021 సోమవారం … నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (09-08-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

వృషభ రాశి (Taurus) :

09-08-2021

ఇంట బయట సంతోషకర వాతావరణం ఉంటుంది నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. వాహన యోగం ఉన్నది.

మిధున రాశి (Gemini) :

కొన్ని విషయాలలో మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక, సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన రుణయత్నాలు చెయ్యకపోవడం మంచిది.

కర్కాటక రాశి (Cancer) :

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.కుటుంబ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

సింహ రాశి (Leo) :

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

కన్య రాశి (Virgo) :

ఆర్థిక పరమైన చిక్కులు నుండి ఉపశమనం కలుగుతుంది నూతన కార్యక్రమాలు ప్రారంభించిన విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra) :

బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి (Scorpio) :

సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలకు సంభందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో సౌకర్యాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి.

ధనస్సు రాశి (Sagitarus) :

ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది.

మకర రాశి (Capricorn) :

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.

కుంభ రాశి (Aquarius) :

ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

మీన రాశి (Pisces) :

దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్ధిక విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన వలన శిరో బాధలు పెరుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (08-08-2021 నుంచి 014-08-2021 వరకు)

తాజా సమాచారం కోసం మాసిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి
Https://Www.Facebook.Com/SirimalliPage