Bhakthi

Today Horoscope : 08-05-2021 శని వారం నేటి రాశిఫలాలు..

Today Horoscope : 08-05-2021 శని వారం  నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల(Today Horoscope)ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. 

SREE KRUPA (08-05-2021) రాశి ఫలితాలు

మేషం :

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.వృత్తి,ఉద్యోగాలలో నూతన అవకాశములు అందుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయమవుతారు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలకు పెట్టుబడులకు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభం :

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ధన వ్యవహారాలు మెరుగు పడతాయి. వ్యాపారాలలో ఉన్నతి కలుగుతుంది. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుతాయి విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి .

మిధునం :

ఆదాయానికిమించిఖర్చులుంటాయి. వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.భూ సంభందిత వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారమున ప్రారంభమునకు పెట్టుబడులు సకాలంలో అందవు. ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహం కలిగిస్తుంది.

కర్కాటకం :

చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

సింహం :

నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.పాతమిత్రులతో కలిసి దూరప్రయాణాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగులకు నూతన ఆశలు చిగురిస్తాయి.

కన్య :

బంధుమిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఒక కీలక వ్యవహారంలో మిత్రులతో ఏర్పడిన వివాదం పరిష్కారం దిశగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత ఉత్సాహాన్నిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కోపాన్ని అదుపులో వుంచడం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

తుల :

విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో సొంతనిర్ణయాలు తీసుకోవడం మంచిది. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందం చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్తులు తో ఉన్న వివాదాలు సర్దుమణుగుతాయి.

వృశ్చికం :

మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి ఆర్థికంగా పుంజుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. సోదరులు సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో మెరుగైన వాతావరణం ఉంటుంది. విద్య అనుకూలతp కలుగుతుంది.

ధనస్సు :

గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు.కీలక విషయాల్లో సన్నిహితులసహాయం అందుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

మకరం :

వ్యాపారాలలోపెట్టుబడులకు లాభాలు అందుకుంటారు దూరప్రాంత ప్రయాణాలు కలసివస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి. ఆదాయ బాగుంటుంది. దీర్ఘ కాలిక రుణాల తీర్చగలుగుతారు.

కుంభం :

కుటుంబ సభ్యులతో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు దూర ప్రయాణాలలో తొందరపాటు మంచిదికాదు. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ధనప్రాప్తి పొందుతారు.వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారమున కీలక నిర్ణయాలు చేస్తారు.

మీనం :

ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం వాహన వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 08-05-2021 శని వారం .. నేటి పంచాంగం

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage