Today Horoscope : 06-05-2021 గురు వారం నేటి రాశిఫలాలు..

Today Horoscope : 06-05-2021 గురు వారం  నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల (Today Horoscope) ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (06-05-2021) రాశి ఫలితాలు

మేషం :

బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. గృహమున శుభకార్య వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధికలుగుతుంది. స్ధిరాస్తి వృద్ధి చెందుతుంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది.

వృషభం :

ఉద్యోగమున అధికారులు ఆదరణ పెరుగుతుంది పాత విషయాలు గుర్తుచేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ఋణ వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలలో ఒత్తిడి నుండి బయటపడతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మిధునం :

కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు ఇంటాబయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తికావు. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది వృధా ఖర్చులు పెరుగుతాయి.

కర్కాటకం :

దూరపు బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి కాస్త మందగిస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది, ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.

సింహం :

దూరప్రాంత బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సోదరులతో విలువైన విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి బహుమతులు అందుకుంటారు సంఘంలోపలుకుబడిపెరుగుతుంది. వ్యాపారమున సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కన్య :

చాలాకాలంగా పూర్తికాని పనులు పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల :

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. అనారోగ్య సూచనలున్నవి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలలో శ్రమ తప్పదు. దూరపు బంధువులను ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారమున చికాకులు పెరుగుతాయి, ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి.

వృశ్చికం :

చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరాశకలిగిస్తాయి. సన్నిహితుల నుంచి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబసభ్యుల నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. ఇంట బయట వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప మార్పులు.

ధనస్సు :

నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగమున మీసేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి , సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మకరం :

పనులలోవ్యయప్రయాసలు అధికమౌతాయి గృహమున అనవసరవస్తువులపై ధనవ్యయం చేస్తారు.జీవిత భాగస్వామితో మాటపట్టింపులుఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసిరావు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.

కుంభం :

నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి దూరపు బంధువులనుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది, నూతన వస్తులాభాలు అందుతాయి. ఉద్యోగాలలో వివాదాల పరిష్కారంఅవుతాయి. వ్యాపారాలలోనూతనోత్సాహం. లాభాలు అందుకుంటారు.

 

మీనం :

ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. దాయాదులతో భూవివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని స్థానచలనాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 06-05-2021 గురు వారం .. నేటి పంచాంగం

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage