Bhakthi

Today Horoscope : 06-08-2021 శుక్రవారం… నేటి రాశిఫలాలు..

Today Horoscope : 06-08-2021 శుక్రవారం … నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (06-08-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి చేపట్టిన పనులలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి . సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వహించాలి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు.

వృషభ రాశి (Taurus) :

కొన్ని విషయాలలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృధా వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలకు పెట్టుబడులు సకాలంలో అందవు కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిధున రాశి (Gemini) :

ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. వాహన వ్యాపారులకు లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

కర్కాటక రాశి (Cancer) :

ధనపరంగా ఇబ్బందులు తప్పవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది నిరుద్యోగుల ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు ఉండదు అధికారులతో వివాదాలు కలుగుతాయి.

సింహ రాశి (Leo) :

పాత మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాల వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

కన్య రాశి (Virgo) :

చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన ధైర్యంగా ముందుకు సాగుతారు. ఊహించని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra) :

సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రవర్తనకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపార పరంగా ఎదురైనా సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. దూర ప్రాంతాల వారి నుండి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.

వృశ్చిక రాశి (Scorpio) :

కొన్ని వ్యవహారాలలో దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు పొందుతారు. భూ సంబంధిత క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి.సోదర వర్గం వారి నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు రాశి (Sagitarus) :

సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి కొంత ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి.

మకర రాశి (Capricorn) :

దీర్ఘ కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి దైర్యంగా బయటపడతారు. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువులు కుడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. జీవిత భాగస్వామితో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

కుంభ రాశి (Aquarius) :

నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి ప్రయాణాలలో సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు వేగవంతం.

మీన రాశి (Pisces) :

చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఆర్థికంగా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. సామజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read :

తాజా సమాచారం కోసం మాసిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి
Https://Www.Facebook.Com/SirimalliPage