2024-07-18 02:35:37
Today Horoscope : 03-07-2021 శనివారం… నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 03-07-2021 శనివారం… నేటి రాశిఫలాలు..

Today Horoscope : 03-07-2021 శనివారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (03-07-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో ఊహించని మాటపట్టింపులుంటాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగమున కొందరి ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి.

వృషభ రాశి (Taurus) :

వృత్తి ఉద్యోగాలు విశేషంగా రాణిస్తారు. వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు. దూర ప్రాంత బంధు మిత్రుల నుండి వివాదాలకు చెందిన కీలక సమాచారం సేకరిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలుకు లోటు ఉండదు. ఆదాయ మార్గాలు విస్తృతమౌతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిధున రాశి (Gemini) :

కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలుకు ధన సహాయం అందుతుంది.వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

కర్కాటక రాశి (Cancer) :

సోదరులతో ఆర్ధిక పరమైన వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులలో ఒడిదుడుకులు కలుగుతాయి. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.

సింహ రాశి (Leo) :

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక కొంత నిరాశ తప్పదు. వృత్తి వ్యాపారాలలో భాగస్వామ్యులతో వివాదాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి.

కన్య రాశి (Virgo) :

విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు లభిస్తాయి. గృహమున పాత మిత్రులతో ఆనందం గడుపుతారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన వ్యాపారస్థులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra) :

నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబసభ్యులు సలహాలు కలిసి వస్తాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చిక రాశి (Scorpio) :

కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార విషయాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి.

ధనస్సు రాశి (Sagitarus) :

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు దీర్ఘకాలిక ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు కలుగుతాయి దూర ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి.

మకర రాశి (Capricorn) :

గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు చేస్తారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులు అధిగమిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. నూతన వ్యాపార ప్రారంభానికి ప్రణాళికలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభ రాశి (Aquarius) :

దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మీన రాశి (Pisces) :

అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు చుట్టుపక్కల వారితో వివాదాలు పరిష్కరించుకుంటారు. సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కారం అవుతాయి గృహమున శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగమున సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 03-07-2021 శనివారం… నేటి పంచాంగం..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage