2024-07-18 02:31:17
Today Horoscope : 01-06-2021 మంగళవారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 01-06-2021 మంగళవారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 01-06-2021 మంగళవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు(Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి

REE KRUPA (01-06-2021) రాశి ఫలితాలు

మేషం (Aries) :

చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు.ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మీయులు సలహాలు తీసుకోని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధనలబ్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఉన్నతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగమున సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

వృషభం (Taurus) :

నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి నూతన వస్తు వాహన లాభాలున్నవి. చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా కాలంగా వేధిస్తున్న చికాకులు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. వ్యాపారాలు లాభాలబాట పడతాయి.ఉద్యోగమున మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మిధునం (Gemini) :

చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి.రుణభారం వలన మానసికంగా స్థిమితం ఉండదు. వృధాప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయటా నూతన సమస్యలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో నిలకడ రాణించవు. .ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది.

కర్కాటకం (Cancer) :

సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి వ్యాపార విషయమై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీ కష్టం వృధా అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభమున్నది.

సింహం (Leo) :

ఇంట బయట విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు ఆప్తుల నుండి పెట్టుబడులు అందుతాయి. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులను పొందుతారు.

కన్య (Virgo) :

సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. ధన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది . బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరచి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు.

తుల (Libra) :

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు తప్పవు.

వృశ్చికం (Scorpio) :

కీలక వ్యవహారాలలో తొందరపాటు వలన గందరగోళ పరిస్థితులుంటాయి. బంధువుల నుండి ఊహించని ఋణ ఒత్తిడి కలుగుతుంది. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వ్యాపార విషయాలలో భాగస్థులతో విభేదాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

ధనస్సు (Sagitarus) :

అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుండి వివాదాలకు సంభందించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమునసమస్యలను పరిష్కరించుకుంటారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

మకరం (Capricorn) :

జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో అధిక కష్టం తో స్వల్ప ఫలితం పొందుతారు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

కుంభం (Aquarius) :

నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులు తో శుభకార్యాలకు హాజరవుతారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మీనం (Pisces) :

ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. బంధువర్గం నుండి వినకూడని మాటలు వినవలసి రావచ్చు. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది.ఇంట బయట చికాకులు పెరుగుగుతాయి. వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read :

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage