Today Horoscope : ఆ రాశి వారికి లాభసాటిగా వృత్తి, వ్యాపారాలు! (30-06-2022)

Today Horoscope : ఆ రాశి వారికి లాభసాటిగా వృత్తి, వ్యాపారాలు! (30-06-2022)

 

SREE KRUPA (30-06-2022) రాశి ఫలితాలు

మేషం – 30-06-2022

Today Horoscope : ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు.దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు.

వృషభం  -30-06-2022

సన్నిహితులతో కుటుంబమున ఉత్సహంగా గడుపుతారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు.

మిధునం – 30-06-2022

బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. రుణయత్నాలు చేస్తారు. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఋణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి.

కర్కాటకం – 30-06-2022

పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

సింహం – 30-06-2022

చేపట్టిన వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. ఉద్యోగమున కొన్ని వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.

కన్య – 30-06-2022

కొన్ని పనులలో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు.

తుల – 30-06-2022

ధన, వస్తు, వాహన లాభాలు ఉన్నవి. సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో బయట పడగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు.

వృశ్చికం – 30-06-2022

చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి.

ధనస్సు – 30-06-2022

దూరప్రయాణంలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. ఆరోగ్య విషయమై వైద్య సహాయం అవసరం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి.

మకరం – 30-06-2022

వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. స్థిరాస్తి లాభం కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. దైవారాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభం – 30-06-2022

ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. ముఖ్యమైన పనులలో కావాల్సిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయులు నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

మీనం – 30-06-2022

ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండవు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Monthly Horoscope for June 2022 : ఆ రాశివారికి అన్నివైపుల నుంచీ ఆదాయమే!

 

Weekly Horoscope Telugu : ఆ రాశివారు సమస్యల నుంచి బయట పడతారు ! (26-06-2022 నుంచి 02-07-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page