2024-07-18 01:20:02
Today Horoscope : ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి! (28-06-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి! (28-06-2022)

Today Horoscope : ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి! (28-06-2022)

SREE KRUPA (28-06-2022) రాశి ఫలితాలు

 

మేషం – 28-06-2022

Today Horoscope : పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

వృషభం – 28-06-2022

పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ విషయాలలో చిక్కులు కలుగుతాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది. ధనపరంగా ఇబ్బందులుంటాయి. ఖర్చులు అదుపుచేయడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.

మిధునం – 28-06-2022

సమాజంలో ఆదరణ పెరుగుతుంది. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.

కర్కాటకం – 28-06-2022

ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నవి.కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. వ్యాపారాలలో అకారణంగా వివాదాలు కలుగుతాయి ప్రయాణాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు అధికారుల నుండి అనుకూలత ఉండదు.

సింహం – 28-06-2022

చేపట్టిన పనులలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.

కన్య – 28-06-2022

తండ్రి తన బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగ విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

తుల – 28-06-2022

ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు రెండు రకాలుగా మారుతాయి కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమ కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనారోగ్య సూచనలు కలవు.

వృశ్చికం – 28-06-2022

కావలసిన వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
వ్యాపార పరంగా స్థిరమైన నిర్ణయాలు చేయలేరు. నూతన రుణాలు చేయవలసి రావచ్చు చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి.

ధనస్సు – 28-06-2022

ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. ఆలోచనలు కలసి వస్తాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరు అవుతారు. నూతన వ్యాపారాలు లాభిస్తాయి.

మకరం – 28-06-2022

వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలసి వస్తాయి దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

కుంభం – 28-06-2022

రుణ భారం పెరిగి నూతన రుణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగాలలో విమర్శలు పెరుగుతాయి నూతన పెట్టుబడులు కలిసిరావు.

 మీనం – 28-06-2022

ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. దూరపు బంధువుల నుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది. ఆరోగ్య విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Monthly Horoscope for June 2022 : ఆ రాశివారికి అన్నివైపుల నుంచీ ఆదాయమే!

 

Weekly Horoscope Telugu : ఆ రాశివారు సమస్యల నుంచి బయట పడతారు ! (26-06-2022 నుంచి 02-07-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page