Today Horoscope : ఆ రాశివారికి ఆప్తుల నుండి ధన సహాయం (22-02-2022)

Today Horoscope : ఆ రాశివారికి ఆప్తుల నుండి ధన సహాయం (22-02-2022)

SREE KRUPA (22-02-2022) రాశి ఫలితాలు

 

Today Horoscope : మేషం – 22-02-2022

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి . దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించని రీతిలో పనులు పూర్తవుతాయి . నూతన వాహనం కొనుగోలు చేస్తారు . వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి . ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.

వృషభం – 22-02-2022

చాలాకాలంగా ఎదురుచూస్తున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి.విలువైన వాస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుండి ధన సహాయం అందుతుంది.కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి.ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

మిధునం – 22-02-2022

చిన్ననాటి మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.సంతాన విద్యా విషయాలు నిరుత్సాహ పరుస్తాయి.ఇంటాబయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగస్తులకు అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు.

కర్కాటకం  – 22-02-2022

సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు.ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

సింహం – 22-02-2022

సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రావసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.ఉద్యోగస్తులు ఆశించిన పదవులు పొందుతారు.

కన్య – 22-02-2022

ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.దూర ప్రాంత బంధు మిత్రులను కలుసుకుంటారు.ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది.వృత్తి వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి.నిరుద్యోగులకు మరోసారి నిరాశ తప్పదు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులు నుండి ఒత్తిడి పెరుగుతుంది.

తుల – 22-02-2022

సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు.ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

వృశ్చికం – 22-02-2022

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.ముఖ్యమైన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు.స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు.వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగస్తులకు స్దానచలన సూచనలు తప్పవు.

ధనస్సు – 22-02-2022

చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా  గడుపుతారు.అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తిచేస్తారు.ఆత్మీయుల నుండి అవసరానికి సహాయ సహకారాలు  అందుతాయి.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

మకరం – 22-02-2022

కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.బందువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం – 22-02-2022

పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి.

మీనం – 22-02-2022

ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి.ఋణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.పితృ వర్గ బంధువులతో వివాదాలు ఉంటాయి.వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.నిరుద్యోగులకు ఒక వార్త ఊరట ఇస్తుంది.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.comGIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి ఆప్తుల నుంచి శుభవార్తలు

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (22-02-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page