2024-07-18 01:53:58
Today Horoscope : ఆ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు! ( 15-03-2022 ) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు! ( 15-03-2022 )

Today Horoscope : ఆ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు! ( 15-03-2022 )

SREE KRUPA (15-03-2022) రాశి ఫలితాలు

 

మేషం – 15-03-2022

Today Horoscope : ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తల్లి తరపు బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులులో జాప్యం కలుగుతుంది. విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.

వృషభం – 15-03-2022

ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది నూతన వస్త్రవస్తు లాభాలు పొందుతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాల శుభవార్తలు అందుతాయి. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.వాహన యోగం ఉన్నది.

మిధునం – 15-03-2022

మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో చిన్ననాటి మిత్రులతో పాల్గొంటారు.

కర్కాటకం – 15-03-2022

ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు.కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది.

సింహం – 15-03-2022

చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.

కన్య – 15-03-2022

ఆర్థిక పరమైన చిక్కులు నుండి బయటపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తిచేస్తారు వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారాలు అంచనాలను దాటి లాభాలు అందుతాయి.

తుల – 15-03-2022

బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. ధనపరంగా ఇబ్బందులను అధిగమించి ఋణాలు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృశ్చికం – 15-03-2022

సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి.

ధనస్సు – 15-03-2022

శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. బంధు మిత్రులతో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మకరం – 15-03-2022

నూతన వస్తు వాహన సౌకర్యాలు లాభిస్తాయి. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. ధనదాయం పెరుగుతుంది.

కుంభం – 15-03-2022

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మీనం – 15-03-2022

దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరో బాధలు పెరుగుతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి అవసరానికి ధన సహాయం 13-03-2022 నుండి 19-03-2022

 

For More Updates Follow us on – Sirimalli Page