2024-07-18 01:27:14
Today Horoscope : ఆ రాశి వారి మాటకు ఇంటా బయటా విలువ పెరుగుతుంది ( 14-03-2022 ) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారి మాటకు ఇంటా బయటా విలువ పెరుగుతుంది ( 14-03-2022 )

Today Horoscope : ఆ రాశి వారి మాటకు ఇంటా బయటా విలువ పెరుగుతుంది ( 14-03-2022 )

SREE KRUPA (14-03-2022) రాశి ఫలితాలు

 

మేషం – 14-03-2022

Today Horoscope :  చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు కొంత మానసికంగా బాధిస్తాయి.ఉద్యోగస్థులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం – 14-03-2022

ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది. బంధువుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మిధునం – 14-03-2022

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ముఖ్యమైన పనులలో ఆశించిన విజయం సాధిస్తారు. వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు పొందుతారు. విలువైన, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

కర్కాటకం – 14-03-2022

చేపట్టిన పనులు జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలు తీరుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన సమస్యలు సర్దుమణుగుతాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. గృహమున సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

సింహం – 14-03-2022

సోదరుల మాటపట్టింపులుంటాయి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపార విషయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.

కన్య – 14-03-2022

బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి గృహనిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగమున బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక సమస్యలు నుంచి కొంత వరకు బయటపడతారు.సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా కొంత చికాకులు తప్పవు.

తుల – 14-03-2022

నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ అవుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం – 14-03-2022

చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.సంఘంలో ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

ధనస్సు – 14-03-2022

దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి.దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.వ్యాపార విషయంలో నిర్లక్ష్యం చెయ్యడం మంచిది కాదు. ఉద్యోగులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

మకరం – 14-03-2022

ముఖ్యమైన పనులలో తొందరపాటు పనిచేయదు కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు ఉద్యోగులకు పనిభారం పెరిగినా సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆర్ధికపరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు నూతన విద్య పై ఆసక్తి పెరుగుతుంది.

కుంభం – 14-03-2022

సంఘంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి ఇతరుల సహాయం అందుతుంది. దూరప్రాంతాలవారి నుంచి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. గృహనిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. విలువైన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం – 14-03-2022

నిరుద్యోగులుకు ఇంటర్వ్యూలకు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తిచేస్తారు. మిత్రులతో కలిసి విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించి లాభాలు పొందుతారు. ఉద్యోగమున పురోగతి సాధిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి అవసరానికి ధన సహాయం 13-03-2022 నుండి 19-03-2022

 

For More Updates Follow us on – Sirimalli Page