Today Horoscope : ఆ రాశి వారికి నూతన వాహనయోగం! (14-06-2022)
Bhakthi Latest

Today Horoscope : ఆ రాశి వారికి నూతన వాహనయోగం! (14-06-2022)

Today Horoscope : ఆ రాశి వారికి నూతన వాహనయోగం! (14-06-2022)

 

SREE KRUPA (14-06-2022) రాశి ఫలితాలు

 

మేషం – 14-06-2022

Today Horoscope : అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్త వ్యవహరించాలి.

వృషభం – 14-06-2022

సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

మిధునం – 14-06-2022

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి నూతన వాహనయోగం ఉన్నది. పనులలో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కర్కాటకం – 14-06-2022

ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

సింహం – 14-06-2022

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయట సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంతమాత్రంగా ఉంటాయి.

కన్య – 14-06-2022

చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.

తుల – 14-06-2022

చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపార,ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి.

వృశ్చికం – 14-06-2022

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి అధికారుల అనుగ్రహం పొందుతారు.

ధనస్సు -14-06-2022

కీలక వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

మకరం – 14-06-2022

అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి.

కుంభం – 14-06-2022

నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మీనం – 14-06-2022

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన రుణయత్నాలు సాగిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Monthly Horoscope for June 2022 : ఆ రాశివారికి అన్నివైపుల నుంచీ ఆదాయమే!

 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి అవసరానికి ధన సహాయం! (12-06-2022 నుంచి 18-06-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page