2024-07-14 01:37:40
Today Horoscope : ఆ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు (12-05-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు (12-05-2022)

Today Horoscope : ఆ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు (12-05-2022)

 

SREE KRUPA (12-05-2022) రాశి ఫలితాలు

మేషం – 12-05-2022

Today Horoscope : ఆర్థిక లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో వచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం – 12-05-2022

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంత బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

 మిధునం – 12-05-2022

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో తొందరపాటు పనిచెయ్యదు. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలతో ముందుకు సాగటం మంచిది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

కర్కాటకం – 12-05-2022

బంధు మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పెరుగుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

సింహం – 12-05-2022

ఇంటా బయట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధువర్గంతో వివాదాలు రాజీ చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య4 – 12-05-2022

దూర ప్రాంత సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉన్నది. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులు సహాయ సహకారాలు అందుతాయి.

తుల – 12-05-2022

కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారంలో బంధువుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.

వృశ్చికం – 12-05-2022

వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమించి లాభాలను అందుకుంటారు. కొన్ని రాష్ట్రాలలో సన్నిహితుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి.

ధనస్సు – 12-05-2022

బంధు మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులకు మీ ప్రవర్తన నచ్చదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలను అధిగమిస్తారు.

మకరం – 12-05-2022

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తొలగుతాయి ఆకస్మిక ధన లాభం ఉన్నది. బంధు మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు.

కుంభం – 12-05-2022

వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో మరింత జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. సంతాన విషయాలపై దృష్టి సారించడం మంచిది.

మీనం – 12-05-2022

చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు నుండి సోదరుల సహాయంతో బయటపడతారు. క్రయ విక్రయాలలో విశేష లాభాలు అందుకుంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Monthly Horoscope for May 2022 : మే నెలలో ఆ రాశివారికి తిరుగులేదు.. అదృష్టమే!

 

Weekly Horoscope Telugu : ఈ రాశివారికి సమాజంలో గౌరవ మర్యాదలకు తిరుగులేదు (08-05-2022 నుంచి 14-05-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page