Today Horoscope : ఆ రాశి వారికి మిత్రుల నుంచి శుభవార్తలు! (11-06-2022)

Today Horoscope : ఆ రాశి వారికి మిత్రుల నుంచి శుభవార్తలు! (11-06-2022)

 

SREE KRUPA (11-06-2022) రాశి ఫలితాలు

మేషం – 11-06-2022

Today Horoscope : గృహమున శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషానిస్తుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

వృషభం – 11-06-2022

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి.

మిధునం – 11-06-2022

కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు కొంత కలచి వేస్తాయి. బంధువులతో అకారణ తగాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.

కర్కాటకం – 11-06-2022

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రావలసిన బాకీలు సకాలంలో వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమున సంతషంగా గడుపుతారు.

సింహం – 11-06-2022

బంధు మిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.సోదరులతో చర్చల్లో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు అదిగమిస్తారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

కన్య – 11-06-2022

ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలుగుతాయి.చేపట్టిన పనులలో కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

తుల – 11-06-2022

అనుకున్న పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. దూరప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం – 11-06-2022

మొండి బాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

ధనస్సు – 11-06-2022

చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. శ్రమతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలున్నవి.

మకరం – 11-06-2022

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగమున కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.

కుంభం – 11-06-2022

చిన్ననాటి మిత్రులతో విభేదాలు కలుగుతాయి ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.

మీనం – 11-06-2022

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన రీతిలో సాగుతాయి.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Monthly Horoscope for June 2022 : ఆ రాశివారికి అన్నివైపుల నుంచీ ఆదాయమే!

 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి అవసరానికి డబ్బు అందుతుంది! (05-06-2022 నుంచి 11-06-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page