Today Horoscope : ఆ రాశి ఉద్యోగస్తులకు శుభవార్తలు! (10-06-2022)
Bhakthi Latest

Today Horoscope : ఆ రాశి ఉద్యోగస్తులకు శుభవార్తలు! (10-06-2022)

Today Horoscope : ఆ రాశి ఉద్యోగస్తులకు శుభవార్తలు! (10-06-2022)

 

SREE KRUPA (10-06-2022) రాశి ఫలితాలు

 

మేషం – 10-06-2022

Today Horoscope : సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

వృషభం – 10-06-2022

అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరస్థి వృద్ధి చెందుతుంది. ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధు మిత్రుల రాకతో సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులు ఉద్యోగలబ్ది పొందుతారు.

మిధునం – 10-06-2022

కీలక వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. బంధువులతో కొన్ని విషయాల్లో మాటపట్టింపులు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఋణ ప్రయత్నాలు కలసిరావు.

కర్కాటకం -10-06-2022

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ధన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం – 10-06-2022

సంతాన నూతన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

కన్య – 10-06-2022

కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందవు.నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాలలో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది.

తుల – 10-06-2022

ఉద్యోగస్థులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం – 10-06-2022

దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి సమయానికి తగిన విశ్రాంతి ఉండదు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ప్రభుత్వ వ్యవహారాలలో విమర్శలు ఎదురవుతాయి.

ధనస్సు – 10-06-2022

గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు చేస్తారు. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

మకరం – 10-06-2022

చాలకాలంగా పూర్తి కానీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు.దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం – 10-06-2022

కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక నిరాశ తప్పదు.

మీనం – 10-06-2022

దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత మానసిక బాధ కలిగిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Monthly Horoscope for June 2022 : ఆ రాశివారికి అన్నివైపుల నుంచీ ఆదాయమే!

 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి అవసరానికి డబ్బు అందుతుంది! (05-06-2022 నుంచి 11-06-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page