Today Horoscope : ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే..  ( 09-03-2022 )
Bhakthi Latest

Today Horoscope : ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే.. ( 09-03-2022 )

Today Horoscope : ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే.. ( 09-03-2022 )

 

SREE KRUPA (09-03-2022) రాశి ఫలితాలు

 

మేషం – 09-03-2022

Today Horoscope : ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఊహించని కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి.

వృషభం – 09-03-2022

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

మిధునం – 09-03-2022

కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి ఆరోగ్య ససమ్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

కర్కాటకం – 09-03-2022

ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

సింహం – 09-03-2022

ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికరంగ సాగుతాయి.

కన్య – 09-03-2022

చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆప్తులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. గృహ నిర్మాణ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

తుల – 09-03-2022

ముఖ్యమైన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి, ఉద్యోగమున పని ఒత్తిడి అధికామౌతుంది.

వృశ్చికం – 09-03-2022

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

ధనస్సు – 09-03-2022

దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మకరం – 09-03-2022

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.వృత్తి వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కుంభం – 09-03-2022

ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహారించాలి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

మీనం – 09-03-2022

చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలు (06-03-2022 నుండి 12-03-2022) వరకు..

 

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (09-03-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page