Today Horoscope : ఆ రాశి వారికి అవసరానికి ధనం చేతికి అందుతుంది! (04-07-2022)

Today Horoscope : ఆ రాశి వారికి అవసరానికి ధనం చేతికి అందుతుంది! (04-07-2022)

SREE KRUPA(04-07-2022) రాశి ఫలితాలు

 

మేషం – 04-07-2022

Today Horoscope : ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.

వృషభం – 04-07-2022

వ్యాపార భాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

మిధునం – 04-07-2022

అవసరానికి ధనం చేతికి అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం – 04-07-2022

ఒక ముఖ్య విషయమై మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్ధిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

సింహం – 04-07-2022

ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఆర్థికంగా లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది.

కన్య – 04-07-2022

పాతరుణాల ఒత్తిడితో నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

తుల – 04-07-2022

సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధన ఆదాయం బాగుంటుంది ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

వృశ్చికం – 04-07-2022

దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం కలుగుతుంది.పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ధన వ్యవహారాలు కలసివస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనస్సు – 04-07-2022

చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గోవటం మంచిది దీర్ఘకాలిక ఋణాల ఒత్తిడి అధికమౌతుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.

మకరం – 04-07-2022

వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

కుంభం – 04-07-2022

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

మీనం – 04-07-2022

గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. రాజకీయవర్గాల వారికీ పదోన్నతులు పెరుగుతాయి. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు. గృహమున శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఈ వారం తిరుగులేదు! (03-07-2022 నుంచి 09-07-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page