Today Horoscope : ఇంటా బయటా అలాంటి కీలక నిర్ణయాలు అమలు  (03-03-2022)
Bhakthi Latest

Today Horoscope : ఇంటా బయటా అలాంటి కీలక నిర్ణయాలు అమలు (03-03-2022)

Today Horoscope : ఇంట బయట అలాంటి కీలక నిర్ణయాలు అమలు (03-03-2022)

SREE KRUPA (03-03-2022) రాశి ఫలితాలు

మేషం – 03-03-2022

 

Today Horoscope : నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి సోదరులతో వివాదాలు రాజి చేసుకుంటారు ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. భూ క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి.

వృషభం – 03-03-2022

చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. పాత బాకీలు కొంత వరకు తీరుతాయి చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మిధునం – 03-03-2022

ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు మందగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి సంతాన విద్యా విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి.

కర్కాటకం – 03-03-2022

కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆర్థిక వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి దైవ చింతన పెరుగుతుంది.

సింహం – 03-03-2022

సంతాన శుభాకార్య విషయాలపై చర్చలు ఫలిస్తాయి.అవసరానికి చేతికిడబ్బు అందుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధలు ఆదిగమిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడతారు.

కన్య – 03-03-2022

నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు. బంధు వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

తుల – 03-03-2022

చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఋణదాతల ఒత్తిడి నుండి అధికమై నూతన ఋణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఊహించని నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలించదు.

వృశ్చికం – 03-03-2022

ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిదానిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.మాతృ వర్గ బంధువుల నుండి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఆకారణ వివాదాలు కలుగుతాయి.

ధనస్సు – 03-03-2022

వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. వివాదాలకు సంభందించి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఓర్పుతో మీ సమస్యల నుండి బయట పడతారు.

మకరం  – 03-03-2022

కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

కుంభం – 03-03-2022

ఉద్యోగస్థులకు నూతన అవకాశములు లభిస్తాయి.ఇంట బయట కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.వృత్తి వ్యాపారమున ఆశించిన లాభాలు పొందుతారు. బంధు మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం – 03-03-2022

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కొన్ని వ్యాపావహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుండి ఊహించని సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. దైవ సేవకార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)